అన్వేషించండి

Hyderabad Police: ఫోన్‌ ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టడంతో వెలుగు చూసిన రూ.712 కోట్ల సైబర్‌ మోసం

Hyderabad Police: చైనీయులు చేసిన రూ.712 కోట్ల పెట్టుబడి మోసాన్ని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేశారు. 

Hyderabad Police: ఫోన్ ఫ్లైట్‌ మోడ్‌ పెట్టిన ఓ వ్యక్తి 716 కోట్ల రూపాయల మోసానికి సంబంధించిన కేసులో కీలకమైన సాక్ష్యాలు ఇచ్చాడు. మొన్నీ మధ్య ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న 9 మందిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి కేసుల్లో సాక్ష్యాల సేకరణ చాలా కష్టమవుతుంది. కానీ ఈ కేసులో కీలకమైన లీడ్ దొరికేందుకు నిందితులు చేసిన ఓ చిన్న పని పోలీసులకు హెల్ప్ అయింది. 

నిందితుల్లో ఒకడైన ప్రకాష్‌ దుబాయ్‌, చైనాలో ఉంటున్న కింగ్‌పిన్‌లతో టచ్‌లో ఉంటాడు. దీని కోసం ఓ మొబైల్ వాడుతుంటాడు. అయితే పోలీసులకు ఎయిర్‌పోర్టులో చిక్కిన రోజు ప్రకాాష్‌ మొబైల్‌ ఫ్లైట్ మోడ్‌లో ఉంది. ఇదే పోలీసులకు చాలా కీలకమైన సమాచారం అందించింది. ఇలాంటి కేసుల్లో నిందితులు పోలీసులకు చిక్కారనే అనుమానం వస్తే సదరుఫోన్‌లలో డెటాను ఆన్‌లైన్‌లోనే అవతలి ఎండ్‌ నుంచి డిలీట్ చేస్తారు. అందుకే ఈ కేసుల్లో మెయిన్ లీడ్‌ను పట్టుకోవడం చాలా కష్టం. 

అయితే ప్రకాషష్ వాడుతున్న మొబైల్‌ ఫ్లైట్‌ మోడ్‌లో ఉండటంతో డాటా డిలీట్ చేయడానికి కుదర్లేదు. దీంతో పోలీసుల పని సులభమైంది. రెండు ఫోన్లు వాడే అలవాటు ఉన్న ప్రకాష్‌ ఒక ఫోన్‌లో అందుబాటులో ఉంటాను కదా అని రెండో ఫోన్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టాడు. ఆన్‌లో ఉన్న ఫోన్‌లోని డేటాని ఈజీగా ఎరేజ్‌ చేసిన చైనాలో ఉంటున్న సైబర్ కేటుగాళ్లు ఫ్లైట్‌ మోడ్‌లో ఉన్న మొబైల్ డేటాను ఏం చేయలేకపోయారు. 

నిందితులను ఎయిర్‌పోర్టులో పట్టుకున్న పోలీసులకు ఈ ఫోన్లు చిక్కాయి. అయితే ఆఫ్‌లో లేని ఫోన్‌ డేటాా ఎరేజ్ చేయడానికి సైబర్ కంత్రీగాళ్లు ఎంతగానో ట్రై చేశారని.. అది సాధ్యం కాలేదని చెబుతున్నారు. అంతకుముందు వారిని సంప్రదించడానికి నేరుగా ఫోన్‌లు కూాడ ట్రై చేశారని  పోలీసులు చెబుతున్నారు. ఎంతకీ వాళ్లు అందుబాటులోకి రాకపోవడంతో డేటా ఎరేజ్ చేసే పనికి సిద్ధమయ్యారు. 

ఈ సైబర్‌ నేరగాళ్లకు ఇదే అలవాటైన పనే అంటున్నారు. అయితే ఇక్కడ నిందితుడు ప్రకాష్‌ తన ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టడంతో అతి పెద్ద సైబర్‌ కుంభకోణాన్ని బయటపెట్టగలిగామంటున్నారు. లేకుంటే గతంలో వెలుగు చూసిన కేసుల మాదిరిగానే ఇది కూాడా అయ్యేదంటున్నారు. 

ఇన్వెస్ట్‌మెంట్‌ల పేరుతో ఈ ముఠా డబ్బులు వసూలు చేస్తూ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడుతున్నారు. వాట్సాప్ మెసేజీలు, సాధారణ టెక్ట్స్ మెసేజీలు, మెయిల్స్ పంపి ఇంట్లో ఉంటూనే నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు అంటూ ప్రకటనలు ఇస్తుంటారు. అలాంటి వాటిని నమ్మి వారిని సంప్రదిస్తే.. ఉద్యోగం ఇవ్వకపోగా.. తిరిగి మన వద్ద నుంచి డబ్బు కాజేస్తారు. టాస్కులు అసైన్ చేయడానికి మొదటి కొంత మొత్తం వెయ్యి లేదా 2 వేల రూపాయలు లోడ్ చేయమంటారు. తర్వాత చిన్న చిన్న టాస్కులు కొన్ని ఇస్తారు. ఏదైనా హోటళ్లు, రెస్టారెంట్లు లాంటి వాటికి రేటింగ్ ఇవ్వమంటారు. అది పూర్తి చేయగానే కొంత మొత్తం మన డాష్ బోర్డులో చూపిస్తారు. ఆతర్వాత 5 వేలు, 10వేలు ఇలా పెంచుకుంటూ పోతారు. మనకు వచ్చే కమీషన్ అంతా డాష్ బోర్డులో కనిపిస్తూనే ఉంటుంది. కానీ విత్‌డ్రా చేసుకునే వీలు ఉండదు. అది విత్‌డ్రా చేసుకోవాలంటే అన్ని టాస్కులు పూర్తి చేయాలని కండీషన్ పెడుతుంటారు. అలా భారీ మొత్తం వారికి సమర్పించుకున్న తర్వాత మీ ఫోన్లు, మెసేజీలకు, మెయిళ్లకు రిప్లై ఇవ్వరు. అలా మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 

హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఈ భారీ మోసాన్ని కనిపెట్టినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా తనకు రేట్ అండ్ రివ్యూలో పార్ట్ టైమ్ ఉద్యోగం ఇప్పించారని, అది నిజమని నమ్మి వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నట్లు ఫిర్యాదుదారు తెలిపారు. మొదట రూ.1000 లోడ్ చేయమని అడిగారని, 5-స్టార్ రేటింగ్ లు ఇవ్వాలంటూ 5 చిన్న చిన్న పనులు కూడా చెప్పారని చెప్పాడు. దాని ద్వారా తనకు రూ.866 లాభం వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇందుకోసం తాను www.travling-boost-99.com లో రిజిస్టర్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఈ ఆన్ లైన్ మోసంపై విచారించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15 వేల మంది నుంచి రూ. 712 కోట్లు మోసం చేశారు. దిల్‌షుఖ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 82 లక్షలు పోగొట్టుకున్నాడు. మరో వ్యక్తి 28 లక్షలు మోసగాళ్లకు సమర్పించుకున్నాడు. ఈ కేసులో పోలీసులు 40కి పైగా బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. బాధితులను నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు తరలిస్తారు. అక్కడి నుంచి 33 షెల్ కంపెనీలకు, మరో 65 బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తారు. వాటి నుంచి భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసేందుకు దుబాయ్ కు పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా క్రిప్టో కరెన్సీని చైనాకు చెందిన ప్రధాన సూత్రధారులకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో కొంత మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget