అన్వేషించండి

లైంగిక వాంఛ తీర్చలేదన్న కోపంతో యువతిపై కత్తెరతో దాడి, మెడపై పొడిచి దారుణ హత్య

Madhya Pradesh Crime: లైంగిక కోరిక తీర్చలేదన్న కోపంతో ఓ వ్యక్తి లివిన్ పార్ట్‌నర్‌ని దారుణంగా హత్య చేశాడు.

Madhya Pradesh Crime News:


ఇండోర్‌లో ఘటన..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ హత్య జరిగింది. లైంగిక కోరిక తీర్చలేదన్న కోపంతో లివిన్ పార్ట్‌నర్‌ని కత్తెరతో పొడిచి దారుణంగా చంపాడో వ్యక్తి. వారం రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే హత్య వెనకాల కారణాలు బయటపడ్డాయి. డిసెంబర్ 9వ తేదీన పోలీసులు డెడ్‌బాడీని గుర్తించారు. ఇంటికి తాళం వేసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి పేరు ప్రవీణ్ సింగ్‌గా గుర్తించారు. ప్రవీణ్‌ సింగ్‌, బాధితురాలు కొద్ది రోజులుగా ఆ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. తన లైంగిక కోరిక తీర్చాలని ఆ యువతిపై ఒత్తిడి తీసుకచ్చాడు ప్రవీణ్ సింగ్. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. ఈ కోపంతోనే కత్తెరతో మెడపై కిరాతకంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన తరవాత భయంతో ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వెళ్లే ముందు ఆ యువతి మొబైల్ ఫోన్‌ కూడా తీసుకుని వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన ఈ హత్య జరిగినట్టు గుర్తించారు. నిందితుడి కోసం దాదాపు మూడు రోజుల పాటు గాలించి చివరకు అరెస్ట్ చేశారు. 

బెంగళూరులోనూ..

బెంగళూరులో ఓ 29 ఏళ్ల యువకుడు లివిన్ పార్ట్‌నర్‌ని కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. తనను మోసం చేసే వేరే వ్యక్తితో యువతి చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు యువకుడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ప్రెజర్ కుక్కర్‌తో గట్టిగా యువతిని కొట్టాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇద్దరూ కేరళకు చెందిన వాళ్లే. దాదాపు రెండేళ్లుగా బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. కాలేజ్‌ రోజుల నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది. కోరమంగళలోని ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే...తనతో సహజీవనం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కోపంతో గొడవకు దిగాడు నిందితుడు వైష్ణవ్. మాటామాట పెరిగింది. కుక్కర్‌తో గట్టిగా కొట్టాడు. మృతురాలి ఫోన్ స్విచ్ఛాప్ రావడం వల్ల ఆమె సోదరి కంగారు పడింది. ఇంటికి వెళ్లి చూసింది. అక్కడా కనిపించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చాక ఈ దారుణం వెలుగు చూసింది. యువతిని చంపిన తరవాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అన్ని చోట్లా గాలించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు.  వీళ్లిద్దరూ లివిన్‌లో ఉన్నారని తల్లిదండ్రులకు కూడా తెలుసని వెల్లడించారు పోలీసులు. వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసినా పట్టించుకోలేదని, అదే ఈ హత్యకు దారి తీసిందని చెప్పారు. స్థానికులు కూడా ఈ జంట పదేపదే గొడవ పడేదని చెబుతున్నారు. 

Also Read: Lok Sabha Security Breach: అందుకే లోక్‌సభపై దాడి చేశాం! విచారణలో నిజాలు బయట పెట్టిన నిందితులు

టాప్ హెడ్ లైన్స్

Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Devotional Thief: దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
దేవుడికి దండం పెట్టుకుని మరీ చోరీ - ఈ దొంగకు భక్తి ఎక్కువ..తెలివి తక్కువ !
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget