Telangana : సూర్యాపేట పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు - సొంత అన్నే కీలక సూత్రధారి - ఆరుగురు నిందితులు అరెస్ట్
Telangana : సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
![Telangana : సూర్యాపేట పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు - సొంత అన్నే కీలక సూత్రధారి - ఆరుగురు నిందితులు అరెస్ట్ Six arrested in suryapet honor killing case Telangana : సూర్యాపేట పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు - సొంత అన్నే కీలక సూత్రధారి - ఆరుగురు నిందితులు అరెస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/697669b75e48b9b6c4504ebcc2ba3a3d1738155576812697_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana : ఇటీవల సూర్యాపేట జిల్లా (Suryapet Dist)లో చోటు చేసుకున్న పరువు హత్య కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జరుపుతోన్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కులాంతరం వివాహం చేసుకుందన్న కోపంతో అమ్మాయి తరపు బంధువులే ఈ హత్య చేసినట్టు దర్యాప్తులో తెలింది. హత్య చేసింది అమ్మాయి సోదరుడేనని పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.
ఎప్పుడు, ఎలా మొదలైందంటే..
సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (Vadlakonda Krishna) అలియాస్ బంటి, భార్గవి అనే పిల్లలమర్రికి చెందిన యువతి ఆర్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తరపు వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణను చంపుతానని పలుమార్లు భార్గవి సోదరుడు నవీన్ బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే నవీన్ తో ముందు నుంచే ఉన్న పరిచయంతో కృష్ణ తరచూ వాళ్లింటికి వస్తూండేవాడు. ఈ క్రమంలోనే భార్గవి, కృష్ణ మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ సమయంలోనే కుటుంబసభ్యులు వేరే సంబంధం తీసుకురావడంతో.. అది ఇష్టం లేని భార్గవి, కృష్ణతో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.
బంధువులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సూర్యాపేటలో నివాసముంటోంజియ ఈ జంట తమ కళ్ల ముందే ఉండడాన్ని భార్గవి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. అంతులేని పగతో భార్గవి సోదరుడు నవీన్ పక్కా ప్లాన్ వేసి మరీ కృష్ణను హతమార్చాడు. అందుకు కుటుంబసభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరి సహాయమూ తీసుకున్నాడు. అలా జనవరి 26వ తేదీన రాత్రి 9గంటల సమయంలో జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో ఒకరైన బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజామున పిల్లలమర్రి గ్రామం వద్ద మూసీ కాలువ (Musi Canal) కట్టపై కృష్ణ డెడ్ బాడీని వదిలేసి, నిందితులందరూ పరారయ్యారు. ఘటన అనంతరం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. ఫైనల్ గా ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వివాహమే అని తేలింది. ఈ క్రమంలోనే హత్య చేసిన నిందితుల వివరాలు కూడా బయటికొచ్చాయి.
రెండు నెలల ముందు నుంచే ప్లాన్
తమ సోదరిని వేరే కులం వ్యక్తి వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతే భార్గవి సోదరుడు నవీన్, కృష్ణను హతమార్చేందుకు రెండు నెలల నుంచే ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్య చేసేందుకు తాళ్లగడ్డకు చెందిన బైరు మహేష్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నాడు. ఈ పథకాన్ని మొదట జనవరి 19న అమలు చేయాలని భావించినప్పటికీ, అప్పుడు కుదరకపోవడంతో జనవరి 26, ఆదివారం నాడు హత్య చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)