అన్వేషించండి

Kolkata Junior Doctor Case: కోల్‌కతా ఘటనపై ఐఎంఏ సంచలన నిర్ణయం- కాల్‌ డేటాతో వెలుగులోకి ప్రిన్సిపల్ వికృత చర్య

Kolkata News:ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రి మాజీ ప్రిన్సిప‌ల్‌పై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ వేటు వేసింది. జూనియ‌ర్ డాక్ట‌ర్ కేసులో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఈ నిర్ణయం తీసుకుంది.

Junior Doctor Rape and Murder Case: కోల్‌క‌తా ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రి ప్రిన్సిప‌ల్ పై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (IMA) వేటు వేసింది. ఆస్ప‌త్రి ప్రిన్సిప‌ల్ డాక‌ర్ట‌ర్ సందీప్ ఘోష్ స‌భ్య‌త్వాన్ని ఐఎంఏ ర‌ద్దు చేసింది. దీంతోపాటు ఐఎంఏ కోల్‌క‌తా బ్రాంచ్ వైఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఘోష్ స‌భ్య‌త్వాన్ని సైతం సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన ఆర్డ‌ర్ కాపీని విడుదల చేసింది. 

కోల్‌క‌తా ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రిలో జూనియ‌ర్ డాక్ట‌ర్‌పై అత్యాచార సంఘ‌ట‌న దేశ‌వ్యావ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసును ఐఎంఏ జాతీయ అధ్య‌క్షుడు అశోక‌న్ నేతృత్వంలోని క‌మిటీ సుమోటోగా స్వీక‌రించింది. విచార‌ణ‌లో భాగంగా వారు బాధితురాలి త‌ల్లిదండ్రుల‌ను విస్మ‌రంచార‌ని క‌మిటీ గుర్తించింది. ఐఎంఏ బెంగాల్ శాఖ‌తోపాటు మ‌రికొన్ని వైద్య సంఘాలు సందీప్ ఘోష్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి. హ‌త్యాచార ఘ‌ట‌న సంద‌ర‌భంగా ప్రిన్సిప‌ల్ ప్ర‌వ‌ర్త‌న‌పై ప్ర‌జ‌ల నుంచి కూడా భారీ నిర‌స‌న‌ వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ మీ ఇండియన్ మెడిక‌ల్ అసోసియేష‌న్ స‌భ్య‌త్వాన్ని సస్పెండ్ చేయాల‌ని ఏకగ్రీవంగా నిర్ణ‌యించిన‌ట్టు సందీప్ ఘోష్‌ను ఉద్దేశిస్తూ ఆర్డ‌ర్ కాపీని విడుద‌ల చేశారు. 

క‌న్నకూతురు మాన‌వ మృగాల చేతుల్లో హ‌త్యాచారానికి గురై పుట్టెడు దుఃఖంలో ఉన్న జూనియ‌ర్ డాక్ట‌ర్ త‌ల్లిదండ్రుల‌తో ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రి ప్రిన్సిప‌ల్ సందీప్ ఘోష్ అత్యంత దారుణంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు మీడియాకు విడుద‌లైన కాల్ రికార్డుల‌ను బ‌ట్టి తెలుస్తోంది. అండ‌గా ఉండాల్సింది పోయి వారి ప‌ట్ల అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిచిన‌ట్టు కాల్ డేటా స్ప‌ష్టం చేస్తోంది. హ‌త్య జ‌రిగిన మ‌ర్నాడు ఉద‌యం బాధితురాలి త‌ల్లిదండ్రుల‌తో ఆస్ప‌త్రి ప్రిన్సిప‌ల్ సందీప్ ఘోష్ మాట్లాడిన మాట‌లు మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సున్నిత‌మైన అంశం ప‌ట్ల చాలా నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించార‌ని అర్థ‌మ‌వుతోంది. 

మీడియాలో ప్ర‌సారం అవుతున్న ఆడియో క్లిప్పుల ప్రకారం.. హ‌త్యాచారం జ‌రిగిన మ‌ర్నాటి ఉద‌యం ఆగస్టు 9న అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ అని చెప్పుకొన్న ఓ మహిళ అర గంట వ్యవధిలో ట్రెయినీ డాక్టర్ తల్లిదండ్రులకు మూడుసార్లు ఫోన్లు చేసి మాట్లాడింది.  మొదటి ఫోన్‌ కాల్ ఉదయం 10.53 గంటలకు చేసి మాట్లాడింది. ‘ఆర్జీ కర్‌ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నా.. మీ కుమార్తె ఆరోగ్యం బాలేదు. మీరు త్వ‌రగా ఆస్ప‌త్రికి రావాల‌ని పోన్ చేశారు. మ‌రోసారి ఆమె కండిష‌న్ సీరియ‌స్‌గా ఉంది. మీరు బ‌య‌ల్దేరారా లేదా అని వాక‌బు చేశారు. మ‌రోసారి కాల్ చేసి మీ కుమార్తె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చెప్పారు. ఆస్ప‌త్రికి వ‌స్తే డాక్ట‌ర్లు వివ‌రాలు చెబుతార‌ని ఫోన్ పెట్టేశారు. 

సందీప్ ఘోష్ ఆస్తుల‌పై సీబీఐ దాడులు

హ‌త్యాచార ఉదంతం నేప‌థ్యంలోనే సందీప్ ఘోష్‌పై పలు అవినీతి ఆరోప‌ణ‌లు వెలుగులోకి వ‌చ్చాయి. సందీప్ ఘోష్.. ఆస్ప‌త్రిలోని అనాథ శ‌వాల‌ను అమ్ముకునేవాడ‌ని ప్ర‌స్తుతం ముర్షిదాబాద్ మెడిక‌ల్ కాలేజీ డిప్యూటీ సూప‌రింటెండెంట్‌గా ఉన్న అక్త‌ర్ అలీ ఆరోపించారు. ఆస్ప‌త్రిలో వాడిప‌డేసిన సిరంజీల‌ను, ఇత‌ర సామాగ్రిని రీసైకిల్ చేసి అమ్ముకునేవాడ‌ని ఆయ‌న ఆరోపించారు. అక్త‌ర్ అలీ గతేడాది క్రితం వ‌ర‌కు ఆర్జీ క‌ర్ ఆస్ప‌త్రిలోనే ప‌నిచేసి ఉండ‌టం విశేషం. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐ అధికారులు దృష్టిసారించారు. సందీప్ ఘోష్ ఆస్తుల‌పై సీబీఐ దాడులు చేసింది. ఒక్క‌రోజే 15 చోట్ల సీబీఐ అధికారులు దాడులు నిర్వ‌హించారు. వైద్యురాలి హ‌త్యాచారం కేసులో ప్రిన్సిప‌ల్ కు ఇప్ప‌టికే లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు కూడా చేశారు. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీ నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక బృందాలు ఆయ‌న‌కు పాలీగ్రాప్ ప‌రీక్ష‌లు నిర్వహించారు. 

Also Read: రిటైర్‌ అయ్యే ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్‌ దరఖాస్తు - వివరాలన్నీ ఒకే ఫారంలో, సంతకం చేస్తే చాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget