అన్వేషించండి

Mahabubnagar Crime News: తనను ప్రేమించలేదని కత్తితో దాడి చేసి యువతి దారుణహత్య.. జడ్చర్లలో దారుణం

జడ్చర్లలో తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై కత్తితో దారుణంగా దాడి చేయగా, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రేమ నిరాకరించినందుకు యువతిపై కత్తితో దాడి, హత్య.
  • ప్రేమోన్మాది దాడిలో ఉపాధ్యాయురాలు చికిత్సలో మృతి.
  • స్థానికులు పట్టుకుని చితకబాదారు, పోలీసులకు అప్పగింత.
  • బాలికపై అత్యాచారం: కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష.

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. జడ్చర్లలోని ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న యువతిని నిందితుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం నాడు ఆమె బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా అడ్డుకట్ట వేసిన ప్రేమోన్మాది తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పలుమార్లు పొడిచాడు.  

కత్తి దాడిలో యువతికి  పలుచోట్ల తీవ్ర గాయాలు కాగా, తీవ్ర రక్తస్రావం అయింది. యువతిపై కత్తి దాడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ హత్య జడ్చర్లలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరోవైపు, యువతిపై కత్తితో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రేమోన్మాదిని స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!

కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు!
హైదరాబాద్: రక్షణ కల్పించాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. బోయిన్‌పల్లి సీఐ తిరుపతిరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మధ్య మండలంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన వరదరాజ్‌ సుదేశ్‌ (39) అనే వ్యక్తి, 2020 లో తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో, బోయిన్‌పల్లి పోలీసులు సదరు కానిస్టేబుల్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సైఫాబాద్‌లోని హాకా భవన్‌లో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు తుది తీర్పు వెలువరించింది. కానిస్టేబుల్ సుదేశ్ చేసిన నేరం పక్కా ఆధారాలతో రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి 31 సంవత్సరాల కఠిన జైలు శిక్షను ఖరారు చేశారు. జైలు శిక్షతో పాటు నిందితుడికి రూ. 12 వేల జరిమానా కూడా విధించారు. అంతేకాకుండా, బాధితురాలైన బాలికకు రూ. 1 లక్ష పరిహారంగా చెల్లించాలంటూ న్యాయస్థానం నిందితుడిని ఆదేశించింది.

Also Read: Nepali Gang Arrest In Robbery Case: జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్

Frequently Asked Questions

జడ్చర్లలో యువతి హత్యకు కారణం ఏమిటి?

ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఒక ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. యువతిని నిందితుడు గతంలో ప్రేమ పేరుతో వేధించినట్లు తెలుస్తోంది.

యువతిపై దాడి తరువాత ఏం జరిగింది?

స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు, తరువాత పోలీసులకు అప్పగించారు.

పోక్సో కేసులో కానిస్టేబుల్​కు ఎంత శిక్ష పడింది?

ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కానిస్టేబుల్​కు 31 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు. రూ. 12 వేల జరిమానాతో పాటు, బాధితురాలికి రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget