News
News
X

Ramananda Prabhu Arrest: బాలికపై లైంగికదాడి కేసులో పీఠాధిపతి శ్రీరామానంద ప్రభు అరెస్టు.. నల్గొండ జైలుకు తరలించిన పోలీసులు

ఆశ్రమంలో ఉన్న 2016 నుంచి 2018 సమయంలో తనపై రామానంద ప్రభు లైంగిక దాడికి పాల్పడ్డారని గురువారం నాడు బొమ్మలరామారం పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. 

FOLLOW US: 

Ramananda Prabhu Arrest: భువనగిరి: లైంగిక దాడి ఆరోపణల కేసులో శ్రీరామానంద ప్రభు అరెస్టయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని సాయిధామం ఆశ్రమం పీఠాధిపతిని బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నల్గొండ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని భువనగిరి ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. 2016 నుంచి 2018 మధ్య కాలంలో శ్రీరామానంద ప్రభు తనపై అత్యాచారం జరిపినట్లు ఓ యువతి బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆయనపై పోక్సో చట్టంతో పాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.

యదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలం పెద్దపర్వతాపూర్ గ్రామ సమీపంలో రామనంద ప్రభుజీ శ్రీ సాయి ధామమ్ అనే ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.  అనాథ బాలిక నల్లగొండ శిశు విహార్ నుంచి సాయి ధామానికి వచ్చి ఆశ్రమంలోనే కొన్నేళ్లు జీవనం సాగించింది. 2016లో ఆశ్రమానికి రాగా, 2018 వరకు అక్కడే ఉన్న సమయంలో రామానంద ప్రభుజీ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పసిపాపగా ఉండగా 17 ఏళ్ల కిందటే ఆడశిశువు లభ్యమైంది. అప్పట్లో అధికారులు నల్గొండ శిశువిహార్‌కు పాపను తరలించారు. 2004లో పెద్దపర్వతాపురంలోని సాయిధామ ఆశ్రమంలో చేర్చారు. బాలిక 2018లో పదో తరగతి పూర్తి చేసింది. ఆ తరువాత సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను హైదరాబాద్‌ అమీర్‌పేటలోని స్టేట్‌ హోంకు తరలించి బాగోగులు చూసుకున్నారు. ఈ క్రమంలో యువతి తనకు గతంలో అన్యాయం జరిగిందని, ఎలాగైనా న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆశ్రమంలో ఉన్న 2016 నుంచి 2018 సమయంలో తనపై రామానంద ప్రభు లైంగిక దాడికి పాల్పడ్డారని గురువారం నాడు బొమ్మలరామారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంచలన ఆరోపణలపై పోలీసులు, పోలీస్ బాస్‌లు సత్వరమే స్పందించారు. ఫిర్యాదు అందిన రోజే రాత్రి ఆశ్రమానికి వెళ్లి రామానంద ప్రభును అరెస్ట్ చేశారు. శుక్రవారం భువనగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. న్యాయమూర్తి జనవరి 12వ తేదీ వరకు స్వామీజీకి రిమాండ్ విధించారు. అనంతరం రామానంద ప్రభును పోలీసులు నల్గొండ జైలుకు తరలించినట్లు భువనగిరి ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు.

అన్యాయంగా ఆరోపణలు..
సాయి ధామమ్ పీఠాధిపతి శ్రీరామానంద ప్రభుపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే కేసు నమోదైందని సాయిధామం సభ్యులు చెబుతున్నారు. స్వామీజీ అరెస్టును నిరసిస్తూ సాయిధామంలోని ఉచిత పాఠశాల, సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాలను మూసివేశారు. పీఠాధిపతి వచ్చే వరకు పనులు, పూజలు చేసేది లేదని, ఆయన విడుదలయ్యే వరకు పోరాడుతాం అంటున్నారు.  
Also Read: Gold Silver Price: కొత్త సంవత్సరంలో పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. మళ్లీ దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ.. 
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి! 
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Jan 2022 09:52 AM (IST) Tags: Crime News Pocso act Telugu News Yadadri Sri Ramananda Prabhu Sri Ramananda Prabhu Arrest Yadadri News

సంబంధిత కథనాలు

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

రూటు మారుస్తున్న గంజాయి స్మగ్లర్లు- హైదరాబాద్ పోలీసుల నిఘాకు చిక్కకుండా స్కెచ్‌

Nellore News: నెల్లూరు కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

Nellore News: నెల్లూరు కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

Kamareddy News: చీప్‌ లిక్కర్‌ కొరతతో గ్రామాల్లో గుప్పుమంటున్న గుడుంబా!

Kamareddy News: చీప్‌ లిక్కర్‌ కొరతతో గ్రామాల్లో గుప్పుమంటున్న గుడుంబా!

బురఖాలో వచ్చి బ్యాంకులో 12 వేల కోట్లు కొట్టేశాడు- కేటుగాడి ప్లాన్ తెలిసి షాక్ తిన్న పోలీసులు

బురఖాలో వచ్చి బ్యాంకులో 12 వేల కోట్లు కొట్టేశాడు- కేటుగాడి ప్లాన్ తెలిసి షాక్ తిన్న పోలీసులు

Shamshabad Gold Seize : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 7 కిలోల గోల్డ్ సీజ్, ముగ్గురు అరెస్ట్!

Shamshabad Gold Seize : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 7 కిలోల గోల్డ్ సీజ్, ముగ్గురు అరెస్ట్!

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?