అన్వేషించండి

Viral Video: రాయ్‌పూర్ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం: సిగరెట్ కోసం ఘోరం, క్షణాల్లో మంటలు.. ఏం జరిగిందంటే?

Raipur News: రాయ్‌పూర్‌లోని ఉర్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ పంప్ వద్ద ఘోరం జరిగింది. ఆకతాయి పనికి బంకులో మంటలు చెలరేగాయి.

 Raipur News: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలోని బిర్గావ్ ప్రాంతంలోని ఉర్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పెట్రోల్ పంప్ వద్ద మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఇద్దరు యువకులు తమ బైక్‌కు ఇంధనం నింపుకోవడానికి పెట్రోల్ పంప్‌కు వచ్చారు. వారిలో ఒకరు పంపు వద్ద నిలబడి సిగరెట్ తాగడానికి ప్రయత్నించారు. పంపు వద్ద నిలబడి ధూమపానం చేయడం ప్రమాదకరమని భావించి మరొక వ్యక్తి అతన్ని పక్కకు వెళ్లిపోమని చెప్పాడు.  

సిగరెట్ వెలిగించవద్దని చెప్పినందుకు కోపంతో ఆ యువకుడు చేసిన పనికి క్షణాల్లో బంకులో మంటలు అంటుకున్నాయి. కోపంతో ఆ యువకుడు తన స్నేహితుడి బైక్ ట్యాంకులో లైటర్‌ పడేశారు. దీనితో మంటలు వ్యాపించాయి. బైక్, పెట్రోల్ పంప్ మెషిన్ మంటల్లో కాలిపోయాయి. బైక్ పై ఉన్న మరో ప్రయాణికుడు ఏదో విధంగా తప్పించుకోగలిగాడు. పెట్రల్ పంపు పడేసిన సిబ్బంది అక్కడి నుంచి పరుగెత్తాడు. అలా పడేసే క్రమంలో పంపు నుంచి వచ్చిన పెట్రోల్‌ నిందితుడిపై పడ్డాయి. అతనికి కూడా మంటలు అంటుకున్నాయి.  

పంపు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు  

ఇంతలో, పంపులోని ఒక ఉద్యోగి వెంటనే పరిస్థితిని గమనించి అప్రమత్తమయ్యాడు. పంప్‌లో ఉండే పెట్రోల్ సప్లై ఆపేశాడు. మంటలను ఆపే సామగ్రి కోసం పరుగెత్తాడు. ఎక్స్‌టింగ్విషర్‌ను ఉపయోగించి మంటలను ఆర్పాడు. ఉద్యోగుల సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు. మంటలు చెలరేగడంతో పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ బంకు సిబ్బంది వారిని పట్టుకున్నారు. ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది.

ఉర్ల పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, పంప్ ఉద్యోగుల సమాచారం ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడు వెలిగి ఉన్న లైటర్‌తో బైక్ ఇంధన ట్యాంక్‌కు నిప్పంటించాడు. బైక్ రిజిస్ట్రేషన్ వివరాలు, డిజిటల్ ఆధారాలను ఉపయోగించి, పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు

నిందితులిద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పెట్రోల్ పంప్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం,చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఉర్ల పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.                        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Advertisement

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ
Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
TTD News: ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం చుట్టూ పచ్చదనం, రామతీర్థం గుట్టల్లో 3 వేల చెట్లు నాటేందుకు ప్రణాళిక!
ఒక్క చార్జ్‌తో వందల కిలోమీటర్ల ప్రయాణం - రూ.15 లక్షల లోపే బ్రహ్మాండమైన ఎలక్ట్రిక్‌ కార్లు
పెట్రోల్‌ కోసం రూపాయి కూడా ఖర్చు కాదు - రూ.15 లక్షల లోపే బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లు
Embed widget