Poha Viral Video : పోహా తినే ముందు ఈ వైరల్ వీడియో చూడండి.. అటుకుల ప్యాకింగ్ చూస్తే పక్కా తినడం మానేస్తారు
Unhygienic Poha Factory Video : అటుకులు అదేనండి పోహా అంటే ఇష్టమా? అయితే మీరు ఈ వైరల్ వీడియో చూడాల్సిందే. ఒక్కసారి దీనిని చూస్తే తింటోన్న పోహాను కూడా వదిలేస్తారు.

Poha Packing Viral Video : సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది క్రేవింగ్స్ మాత్రమే కాదు.. చిన్న సైజ్ హార్రర్ సినిమాను కూడా చూపించింది. అదేదో మర్డర్ వీడియో కాదు. కానీ చూస్తే తినాలన్నా భయం వేసేలా ఉంది ఆ వీడియో. ఒక పోహా తయారీ ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పోహాను ప్యాక్ చేసేటప్పుడు పరిశుభ్రత నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తుంది.
చాలామంది పోహాను చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈ వీడియోను చూస్తే దాని జోలికి వెళ్లాలన్నా భయపడతారు. ఎందుకంటే ఎంతో ఇష్టంగా తినే పోహాను నేలపై కుప్పగా వేసి.. దాని కార్మికులు కూర్చుని ప్యాకింగ్ చేస్తుండడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆహార భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వీడియోలో ఏముందంటే..
వైరల్ వీడియోలో ఇద్దరు కార్మికులు పెద్ద కుప్పగా పోసిన పోహా మధ్యలో కూర్చుని కనిపించారు. పోహా నేలపై చెల్లాచెదురుగా పడి ఉంది. దాని చుట్టూ ఎలాంటి శుభ్రమైన కవర్ లేదా పరిశుభ్రత ఉన్న ఆనవాలు కూడా కనిపించట్లేదు. ఒక కార్మికుడు అదే పోహా మధ్యలో కూర్చుని ప్యాకెట్లలో నింపుతున్నాడు. అయితే అతని బట్టలు, చేతులు కూడా శుభ్రంగా లేవు. మరొక వ్యక్తి కాళ్లు కూడా అదే పోహాలో కనిపిస్తున్నాయి. వీడియో చూసిన తర్వాత చాలా మంది ఇది చాలా అపరిశుభ్రంగా, దిగ్భ్రాంతికరంగా ఉందని అంటున్నారు. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా పోహా తినడం మానేస్తారు.
పోహా తినడం కూడా ఆపాలి 🥲🥲 pic.twitter.com/x3KLBGZZkJ
— Byomkesh (@byomkesbakshy) February 18, 2026
పరిశుభ్రతపై ప్రశ్నలు
ఆహార పరిశ్రమలో పరిశుభ్రత, ఆరోగ్యంపై కఠినమైన నియమాలు ఉన్నాయి. ఆహార పదార్థాలను ప్యాక్ చేసేటప్పుడు చేతికి తొడుగులు, టోపీలు, మాస్క్‌లు, శుభ్రమైన ఉపరితలం ఉపయోగించడం అవసరం. కానీ వైరల్ వీడియోలో అలాంటి ఏర్పాట్లు ఏమీ కనిపించలేదు. పోహా నేరుగా నేలపై ఉంది. ఏదో గిడ్డంగి లేదా బహిరంగ నేలపై కుప్పగా వేసినట్లుగా ఉంది. ఈ నిర్లక్ష్యం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
సోషల్ మీడియాలో ఆగ్రహం
వీడియో వైరల్ అయిన వెంటనే.. సోషల్ మీడియాలో ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇది నిజమైతే సంబంధిత ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది వినియోగదారులు కామెంట్ చేశారు. కొంతమంది ఆహార భద్రతా విభాగం, FSSAIని విచారణ జరపాలని కోరారు. అదే సమయంలో ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్, నాణ్యతపై శ్రద్ధ వహించాలని కొంతమంది వినియోగదారులు ప్రజలకు సలహా ఇచ్చారు. వీడియోను @byomkesbakshy అనే X ఖాతా నుంచి షేర్ చేశారు.
























