X

Crime News : వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారు ! కానీ వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేశారు..ఎందుకో తెలుసా ?

ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తూ మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 

జైల్లో పెడితే నేరస్తుల్లో పరివర్తన వస్తుందని అనుకుంటారు..కానీ అది పాత మాట. ఇప్పుడు జైల్లో పెడితే అక్కడ ఉన్న ఇతర నేరస్తుల్లో "లైక్ మైండెడ్ " పీపుల్‌తో ఫ్రెండ్ షిప్ చేసి.. ఆలోచనలు పంచుకుని బయటకు వచ్చి నేరాలకు పాల్పడుతున్నారు. జైల్లో కుదిరిన స్నేహాలతో బయటకు వచ్చి మోసాలు చేస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్‌లో పట్టుబడిన ఓ ముఠా తీరు కూడా అంతే ఉంది. ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అసలు మీరు ఒకరికొకరు ఎలా పరిచయమయ్యార్రా అంటే.. జైల్లో అని వారు పోలీసులకు సమాధానం చెప్పారు. 

Also Read : నడిరోడ్డులో రైతుపై దారుణ దాడి.. రాళ్లు, రాడ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు... పొలం దారి వివాదమే కారణమా...?

ప్రభుత్వ సంస్థల్లో..శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామని రూ. లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ చేతిలో పెట్టారని రాచకొండ పోలీసులకు ఇటీవల వరుస ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఇదేదో పెద్ద రాకెట్‌లాగా ఉందని గుర్తించిన పోలీసులు నిఘా పెట్టి కూపీ లాగారు. దీంతో ముఠా బయటపడింది. వరకుమార్, ప్రమోద్ కుమార్, దినకర్ రెడ్డి, ప్రకాష్ అనే నలుగుర్ని అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి మొత్తం గుట్టు బయటకు లాగేశారు. వారిలో వరకుమార్, దినకర్ రెడ్డి మోసాలు చేయడంలో దిట్ట. వేర్వేరు కేసుల్లో జైల్లో ఉన్నప్పుడు ఇద్దరికీ పరిచయం అయింది. దినకర్ రెడ్డి యూకేలో చదువుకుంటూ డిస్ కంటిన్యూ  చేసి వచ్చి మోసాలకు అలవాటు పడ్డాడు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడంలో ప్రావీణ్యం ఉంది. దీంతో బయటకు వెళ్లి ఇలా ఉద్యోగాల పేరుతో మోసం చేయాలని స్కెచ్ వేసుకున్నారు. 

Also Read: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 

బయటకు వచ్చి స్టాంపులు తయారు ప్రకాష్ అనే వ్యక్తితో పాటు ప్రమోద్ కుమార్‌తో ముఠాగా ఏర్పడ్డాయి. ఉద్యోగాల పేరుతో మోసం చేయడం ప్రారంభించారు. జాబ్ కన్సల్టెన్సీలను సంప్రదించడం ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేయడం.. ప్రారంభించారు. ఇలా డబ్బులిచ్చిన వారికి అపాయింట్ మెంట్ లెటర్లు కూడా ఇచ్చే వారు. ఎవరికీ అనుమాననం రాకుండా జీవోలు.. స్టాంపులతో సహా ఇచ్చేవారు. దీంతో  ఆశపడేవాళ్లు మోసపోయేవారు. ఇలా పలువురి దగ్గర దాదాపుగా రూ.22 లక్షలు వసూలు చేశారు. కానీ చివరికి పాపం పండింది. పోలీసులకు చిక్కారు. 

Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్‌ ఫోన్స్‌.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..

వారి వద్ద నుంచి రూ. ఐదు లక్షల 70వేల నగదు , ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్లు, ఫేక్ స్టాంప్స్, ల్యాప్ ట్యాప్, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే అది పక్కాగా మోసమేనని.. ఇలాంటి వారిని నమ్మవద్దని పోలీసులు చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం మోసగాళ్లకు లక్షలకు లక్షలు వెచ్చిస్తూనే ఉన్నారు. 

Also Read:  అమెజాన్‌లో కరివేపాకు పొడి.. తెరిచి చూస్తే గంజాయి.. నలుగురి అరెస్టు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Hyderabad crime Hyderabad Rachakonda Police Job Fraud Fake Appointment Letters

సంబంధిత కథనాలు

Crime News: ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఇంటికి వెళ్లి చూస్తే షాక్.. దారుణమైన స్థితిలో తల్లీ కూతుళ్లు..! అసలేం జరిగిందంటే..?

Crime News: ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఇంటికి వెళ్లి చూస్తే షాక్.. దారుణమైన స్థితిలో తల్లీ కూతుళ్లు..! అసలేం జరిగిందంటే..?

Siddipeta Crime: కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన కసాయి తండ్రి... సిద్ధిపేటలో అమానవీయ ఘటన

Siddipeta Crime: కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన కసాయి తండ్రి... సిద్ధిపేటలో అమానవీయ ఘటన

Hyderabad Crime: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు

Hyderabad Crime: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు

Hyderabad: మేనల్లుడ్ని లైంగికంగా వాడుకున్న అత్త.. ఇంకొకరితో ఆ వీడియోలు తీయించి వాటితో..

Hyderabad: మేనల్లుడ్ని లైంగికంగా వాడుకున్న అత్త.. ఇంకొకరితో ఆ వీడియోలు తీయించి వాటితో..

Nellore Crime: మూడు నెలల క్రితమే పెళ్లి.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్న మహిళా పోలీస్

Nellore Crime: మూడు నెలల క్రితమే పెళ్లి.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్న మహిళా పోలీస్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Rosayya Dead : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !

Rosayya Dead :  తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత..  మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !

Cyclone Report: జవాద్ తుపాను పూరీ వద్ద తీరం దాటే అవకాశం.. ఉత్తరాంధ్రకు వర్షాల ముప్పు

Cyclone Report: జవాద్ తుపాను పూరీ వద్ద తీరం దాటే అవకాశం.. ఉత్తరాంధ్రకు వర్షాల ముప్పు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

KGBV Teachers: కేజీబీవీల్లో పోస్టుల భర్తీ మార్గదర్శకాలు జారీ... అర్హులు ఎవరంటే ?

KGBV Teachers: కేజీబీవీల్లో పోస్టుల భర్తీ మార్గదర్శకాలు జారీ... అర్హులు ఎవరంటే ?