అన్వేషించండి

Guntur Crime: నడిరోడ్డులో రైతుపై దారుణ దాడి.. రాళ్లు, రాడ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు... పొలం దారి వివాదమే కారణమా...?

గుంటూరు జిల్లాలో ఓ రైతుపై కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి కాళ్లు, చేతులు పట్టుకుని రాళ్లు, రాడ్లతో కొందరు దాడి చేశారు.

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాబి అనే రైతుపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు.  ఈ దాడిలో సైదాబి తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై పెళ్లికి వెళ్లి వస్తుండగా మార్గ మధ్యలో అడ్డగించి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పొలం దారి విషయంలో వివాదం కారణంగా సైదాబిపై దాడి చేశారని అతని కుమారుడు జిలానీ తెలిపారు.  

Also Read: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 

దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల తుమ్మల చెరువు లోట్ ప్లాజా వద్ద ఓ వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి  కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు పట్టుకోగా మరో వ్యక్తి బండరాయి కొడుతున్నాడు. బాధితుడు నొప్పితట్టుకోలేక కేకలు పెడుతున్నా కనికరం లేకుండా దాడిచేశారు. ఇనుప రాడ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని సైదాబిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో బాధితుడ్ని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దాడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదాబి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల శివారులో ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్‌రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. పొలం గట్ల వివాదంతో ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపాడు. 

Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్‌ ఫోన్స్‌.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..

పొలం వివాదం... రాజకీయ కోణం లేదు

పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఐపీఎస్ స్పందించారు. సామాజిక మాధ్యమాలలో తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన దాడి వీడియోను చూశానన్నారు. శివారెడ్డి, సైదాబి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పొలం విషయంలో తగాదాలు జరుగుతుందన్నారు. దీంతో సైదాబిపై దాడి జరిగిందన్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై పిడుగురాళ్ల పోలీసులు FIR ౼ 651/2021 కింద బాధితులు సమాచారం మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గతంలో సైదాబి పొలం వివాదంలో శివారెడ్డిపై దాడి చేయగా శివారెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. పిడుగురాళ్ల పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారని ఎస్పీ ప్రకటించారు. పొలం వివాదంలో పాత కక్షల దృష్ట్యా ఈ ఘటన జరిగిందని దీనిలో ఎటువంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ విశాల్ గున్నీ తెలియజేశారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సైదాబి చికిత్స పొందుతున్నారు. 

Also Read:  అమెజాన్‌లో కరివేపాకు పొడి.. తెరిచి చూస్తే గంజాయి.. నలుగురి అరెస్టు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget