IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Visakhapatnam: అమెజాన్‌లో కరివేపాకు పొడి.. తెరిచి చూస్తే గంజాయి.. నలుగురి అరెస్టు

కరివేపాకు పొడి, ఆయుర్వేద పొడి వంటి హెర్బల్‌ పొడుల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్‌తో రహస్యంగా ఒప్పందాలు చేసుకొని గంజాయిని సరఫరా చేస్తున్నారు. విశాఖ కేంద్రంగానే నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

FOLLOW US: 

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో భారీ గంజాయి రాకెట్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అక్కడ పట్టుబడ్డ నిందితుల విచారణలో భాగంగా వారు కీలక విషయాలను వెల్లడించారు. ప్రముఖ ఈ-పోర్టల్ సంస్థ అమెజాన్ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లుగా ఒప్పుకున్నారు. కరివేపాకు పొడి లాంటి ఇతర పేర్లతో సైట్‌లో ఉంటుందని, అంతర్గతంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారని విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు.

ఈ నెల 13న మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఓ దాబాలో గంజాయి పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా విశాఖ నుంచి అమెజాన్ యాప్‌ ద్వారా గంజాయి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. విశాఖ నుంచి వచ్చిన గంజాయిని పికప్‌ చేసుకునే ముగ్గురిని మధ్యప్రదేశ్‌లోని బెండీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆ కేసులో భాగంగానే విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసులు మంగళవారం విశాఖకు చేరుకున్నారు. వీరితో పాటు ఎస్ఈబీ అధికారులు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే విశాఖపట్నం కేంద్రంగా అమెజాన్‌ ద్వారా ఆన్‌ లైన్‌లో గంజాయి స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్‌ పోలీసులు విశాఖ పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు నగరానికి వచ్చి వారు స్థానిక పోలీసుల సాయంతో గంజాయిని సరఫరా వారిని గుర్తించారు. ఇలా స్మగ్లింగ్ చేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తితో పాటు అమెజాన్ పికప్ బాయ్స్ కుమార స్వామి, కృష్ణం రాజు, వెంకట రమణను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు విశాఖలో పోలీసులు విచారణ చేపట్టారు.

కరివేపాకు పొడి, ఆయుర్వేద పొడి వంటి హెర్బల్‌ పొడుల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్‌తో రహస్యంగా ఒప్పందాలు చేసుకొని గంజాయిని సరఫరా చేస్తున్నారు. విశాఖ కేంద్రంగానే నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేసి అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్‌తో పాటు తరలింపునకు వాడుతున్న గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన నలుగురు నిందితులు విశాఖపట్నంలోని కంచర పాలెం ఇండస్ట్రీయల్ ఎస్టే్‌ట్‌లో ఓ కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు.

Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్‌ ఫోన్స్‌.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..

Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 

Also Read: Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత... ఓ ప్రయాణికుడి వద్ద 9 ఐఫోన్లు స్వాధీనం

Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Nov 2021 02:03 PM (IST) Tags: Visakhapatnam Police smugglers in Vizag Ganja smuggling in Amazon Amazon Ganja smuggling Amazon delivery boys

సంబంధిత కథనాలు

Jagananna Amma Vodi : తల్లుల ఖాతాల్లో డబ్బులు, రేపు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Jagananna Amma Vodi : తల్లుల ఖాతాల్లో డబ్బులు, రేపు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?

Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?

AP Inter Supply Exam Fee: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించారా, విద్యార్థులు ఎవరెంత కట్టాలో తెలుసా !

AP Inter Supply Exam Fee: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించారా, విద్యార్థులు ఎవరెంత కట్టాలో తెలుసా !

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

టాప్ స్టోరీస్

Chiranjeevi: 'పక్కా కమర్షియల్' స్టేజ్ పై మారుతితో మెగాస్టార్ బేరం!

Chiranjeevi: 'పక్కా కమర్షియల్' స్టేజ్ పై మారుతితో మెగాస్టార్ బేరం!

Presidential Election 2022 : రేపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్, హాజరుకానున్న మంత్రి కేటీఆర్

Presidential Election 2022 : రేపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్, హాజరుకానున్న మంత్రి కేటీఆర్

Dell G15 5525: వావ్ అనిపించే గేమింగ్ ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన డెల్ - ధర ఎంతంటే?

Dell G15 5525: వావ్ అనిపించే గేమింగ్ ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన డెల్ - ధర ఎంతంటే?

Ram Pothineni: గర్ల్ ఫ్రెండ్ తో రామ్ పెళ్లి - త్వరలోనే ప్రకటన?

Ram Pothineni: గర్ల్ ఫ్రెండ్ తో రామ్ పెళ్లి - త్వరలోనే ప్రకటన?