By: ABP Desam | Updated at : 26 Aug 2021 08:47 AM (IST)
ప్రకాశం జిల్లాలో వ్యక్తి హత్య (ప్రతీకాత్మక చిత్రం)
ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన సొంత బాబాయినే హతమార్చాడు. దారుణంగా చంపేసి వింతగా ప్రవర్తించాడు. మృత దేహం దగ్గరే చేసిన తప్పును బహిరంగంగా చెబుతూ ఒప్పేసుకున్నాడు. చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురి కావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలంలోని పెదారికట్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలివీ..
సొంత బాబాయిని చంపిన యువకుడు మృతదేహం దగ్గరే ఉండి విపరీతంగా మాట్లాడాడు. ‘‘చంపేసి నేనేం పారిపోలా.. మర్డర్ చేసి ఇక్కడే ఉన్నా.. ఆస్తి గొడవల వల్లే చంపేశా.. అయితే, ఇప్పుడేంటి...’’ అంటూ ధైర్యంగా వ్యాఖ్యలు చేశారు. చుట్టుపక్కల అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి ఇలా ప్రవర్తించడం గమనించదగ్గ విషయం. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని పెదారికట్లలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద బుధవారం నిందితుడు హత్య చేశాడని స్థానికులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని కనిగిరి మండలం యడవల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే 48 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
Also Read: Breaking News: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!
అదే గ్రామంలో వెంకటేశ్వరరావుకు రెండో అన్న అయిన వెంకట నారాయణ కుటుంబం ఉంటోంది. ఆయనతో వెంకటేశ్వరరావుకు ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. అయితే, ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ వారం క్రితం కనిగిరిలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వెంకటేశ్వరరావు దరఖాస్తు పెట్టుకున్నారు. అధికారులు వచ్చి విచారణ జరిపారు. దీంతో వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు తన బాబాయిపై మరింత ద్వేషం పెంచుకున్నాడు. మద్యం తాగేందుకు వెంకటేశ్వరరావును పెదారికట్ల గ్రామానికి తీసుకెళ్లాడు. అనంతరం మద్యం తాగాక గొడవ పెట్టుకొని సీసా పగులగొట్టి సొంత బాబాయిని గొంతులో పొడిచి హతమార్చాడు.
పథకం ప్రకారమే హత్య చేసినట్లు చుట్టూ గుమిగూడిన వారితో నిర్భయంగా నిందితుడు అరిచి చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బహిరంగంగా ఈ ఘటన జరగడంతో కొంత మంది ఆ దృశ్యాలను వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అవి వైరల్ అయ్యాయి. పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.
Also Read: Ahmedabad: కండోమ్ మర్చిపోయి.. ఆ పదార్థంతో లైంగిక చర్య, వెంటనే చనిపోయాడు!
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్
Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!
Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!