అన్వేషించండి

Parvathipuram News : చిట్టీలు కట్టించుకుని ఎగ్గొట్టిన మహిళ, స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్థులు!

Parvathipuram News : ఇటీవల కాలంలో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోయాయి. డబ్బు కట్టించుకుని తిరిగి చెల్లించకుండా ఐపీ పెట్టేస్తు్న్నారు. ఇలా మోసం చేసిన ఓ మహిళను గ్రామస్థులు స్తంభానికి కట్టేసి కొట్టారు.

Parvathipuram News : సాధారణంగా పల్లెలు ప్రశాంతతకు పెట్టింది పేరు. గ్రామస్థులు అంత త్వరగా గొడవలకు దూరంగా ఉంటాయి. ఇదంతా ఒకప్పుడు గత కొన్నేళ్లుగా గ్రామాల్లోనూ పరిస్థితులు మారుతున్నాయి. చిన్న కారణాలకే నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో భారీ మోసాలు వెలుగుచూస్తున్నాయి. చిట్టీల రూపంలో రూపాయి రూపాయి దాచుకుంటున్న వారికి కుచ్చు టోపీ పెడుతూ మోసాలకు పాల్పడ్డుతున్నారు కొందరు. ఇలా మోసానికి పాల్పడిన ఓ మహిళను స్తంభానికి కట్టేశారు గ్రామస్థులు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. 

చిట్టీలు కట్టించుకుని మోసం

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన శోభ అనే మహిళ గత కొంత కాలంగా చిట్టీలు కట్టించుకుంటుంది. గ్రామంలోని చాలా మంది శోభ దగ్గర చిట్టీలు వేశారు. ప్రతీ నెల క్రమం తప్పకుండా చిట్టి డబ్బులు జమచేస్తున్నారు. అయితే డబ్బులు జమ అవుతున్నా శోభ గ్రామస్తులెవరికీ తిరిగి చెల్లించడంలేదు. కనీసం వడ్డీ కూడా ఇవ్వలేదు. డబ్బు గురించి అడిగితే ఏవో కారణాలు చెబుతూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. శోభపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అయితే గ్రామస్థుల నుంచి  చాలా రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న శోభ ఇటీవల గ్రామస్థుల కంటపడింది. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

Also Read: Srikakulam: రెండేళ్ల కొడుకుకి ఉరేసిన కన్న తల్లి, ఆ తర్వాత తాను కూడా - శ్రీకాకుళంలో దారుణం

కట్టేసి కొట్టారు! 

శోభను చూసిన గ్రామస్థులు ఆగ్రహంతో ఆమెను ఓ భవనం స్తంభానికి కట్టేశారు. కోపం పట్టలేక కొందరు ఆమెపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థులకు సర్ధి చెప్పి ఆమెను విడిపించారు. పోలీసుల వివరాల ప్రకారం కొమరాడ మండలం శివిని గ్రామంలో శోభ అనే మహిళ చిట్టీల పేరుతో రూ.కోటీ యాభై లక్షలు వసూలు చేసింది.  ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా గ్రామస్థులను ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు, మహిళలు శోభను స్తంభానికి కట్టేశారు. తమ డబ్బులు చెల్లిస్తేనే విడిచి పెడతామన్నారు. తనకు టైం కావాలని ఆమె అడుగుతున్నా స్థానికులు విడిచిపెట్టలేదు.

Also Read : Vizianagaram: వర్క్ ఫ్రం హోంలో బిజీగా భర్త, పక్క గదిలో భార్య దారుణం - ఏం చేసిందో తెలుసా?

Also Read : Kakinada: బాలికను లోపలికి రమ్మని ట్యాబ్లెట్లు ఇచ్చిన హాస్టల్ వార్డెన్, కరోనాకు మందు అని మాయమాటలు - చివరికి

టాప్ హెడ్ లైన్స్

Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget