అన్వేషించండి

Srikakulam: రెండేళ్ల కొడుకుకి ఉరేసిన కన్న తల్లి, ఆ తర్వాత తాను కూడా - శ్రీకాకుళంలో దారుణం

వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో రెండేళ్ల కుమారుడిని తాడుతో ఉరి తీసి, ఆ తర్వాత తాను ఉరి పోసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది.

Srikakulam Mother Son Death: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో రెండేళ్ల కుమారుడిని తాడుతో ఉరి తీసి, ఆ తర్వాత తాను ఉరి పోసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. శనివారం రాత్రి రాజాం గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు వివరాలు అందించారు. 

ఆ మేరకు శనివారం రాత్రి రాజాం గ్రామానికి చెందిన రెయ్యి జ్యోతి అనే 27 ఏళ్ల వివాహిత తన కుమారుడు రెయ్యి ప్రవీణ్ అలియాస్ హృదయాన్ ఇద్దరూ తమ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒడిషా రాష్ట్రం తాడిపేటకు చెందిన జ్యోతికి రాజాం గ్రామానికి చెందిన రెయ్యి ధనరాజుతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ప్రవీణ్ అలియాస్ హృదయన్ ఉన్నారు.

హైదరాబాద్‌లో భార్య జ్యోతి, కుమారుడు ప్రవీణ్ తో ఉంటున్న ధనరాజు ఇటీవలే రాజాం గ్రామానికి వచ్చాడు. కుమారుడి పుట్టిన రోజు వేడుకలు చేసి నాలుగు రోజుల క్రితం భార్య కుమారుడిని తన తల్లి తిరుపతమ్మ వద్ద ఉంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అయితే, శనివారం మధ్యాహ్నం ఉపాధి పనికి ధనరాజు తల్లి తిరుపతమ్మ వెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేరుకున్నాక కోడలు జ్యోతి, మనవడు ప్రవీణ్ తాడుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. దీంతో అవాక్కయిన తిరుపతమ్మ ఆందోళన చెంది కేకలు వేసింది. వెంటనే గ్రామస్థులు వచ్చి పరిశీలన చేసేటప్పటికే వీరు మృతి చెంది ఉన్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోవిందరావు సీఐ రాము చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వలనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కుమారుడిని తాడుతో వేలాడదీసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ కేసుపై మరిన్ని వివరాల కోసం వజ్రపుకొత్తూరు పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Kakinada: బాలికను లోపలికి రమ్మని ట్యాబ్లెట్లు ఇచ్చిన హాస్టల్ వార్డెన్, కరోనాకు మందు అని మాయమాటలు - చివరికి

Also Read: Rape On Cow : చివరికి ఆవును కూడా వదల్లేదు - రేప్ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కేశాడు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget