అన్వేషించండి

Kakinada: బాలికను లోపలికి రమ్మని ట్యాబ్లెట్లు ఇచ్చిన హాస్టల్ వార్డెన్, కరోనాకు మందు అని మాయమాటలు - చివరికి

Kakinada News: నిందితుడు బాలికను తన గదిలోకి తీసుకెళ్లి కరోనా మందు ఉందని చెప్పి ఏవో మందు బిళ్లలు ఇచ్చాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది.

కాకినాడ జిల్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ బాలికను మాయ చేసి హాస్టల్‌ లో ఉండే కరస్పాండెంట్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. హాస్టల్ లోనే ఉంటున్న 15 ఏళ్ల మైనర్ బాలికపై అతను చాలా సార్లు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కాకినాడ టూ టౌన్ పోలీసులు వెల్లడించారు.

కాకినాడ పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. అందుకోసం కొండయ్య పాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రైవేటు హాస్టల్‌లో ఉండి పక్కనే ఉన్న మరో స్కూలులో చదువుకుంటోంది. 6వ తరగతి నుంచి ఆమె అక్కడే ఉంటోంది. కొన్నాళ్ల క్రితమే ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ప్రస్తుతం ఆ బాలిక 9వ తరగతి రాసింది. ఆ ప్రైవేటు హాస్టల్‌లో పర్యవేక్షకుడిగా కరెస్పాండెంట్ కొత్తపల్లి విజయ్ కుమార్ అనే 60 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. 

గత ఏప్రిల్ లో మాయమాటలు చెప్పి బాలికపై చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను బాలికను తన గదిలోకి తీసుకెళ్లి కరోనా రాకుండా తన దగ్గర మందు ఉందని చెప్పి ఏవో మందు బిళ్లలు ఇచ్చాడు. ఆ తర్వాత తనకు బాగా మత్తు వచ్చేసిందని బాలిక పోలీసులకు చెప్పింది. అయితే, ప్రస్తుతం ఎండాకాలం సెలవుల సందర్భంగా స్కూలుకు సెలవులు. దీంతో కొద్ది వారాలుగా బాలిక ఇంటి వద్దనే గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు మూడు రోజులుగా రక్త స్రావం అవుతోంది. తల్లి ఈ విషయం గమనించి అడగ్గా.. ఈ విషయం బయటపడింది. చికిత్స కోసం ఆమెను ఈ నెల 1న కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. 

అయితే, బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు గర్భస్రావం అయిందని డాక్టర్లు తెలిపారు. అందుకే రక్త స్రావం జరిగిందని వెల్లడించారు. శనివారం టూ టౌన్ పోలీసులు చిన్నారితో మాట్లాడారు. ఆమె తల్లి వద్ద కూడా వాంగ్మూలాన్ని తీసుకొని కేసును నమోదు చేశారు. నిందితుడు విజయ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. ఆ హాస్టల్‌లో ఉంటున్న మిగతా బాలికల తల్లిదండ్రులు ఈ ఘటన తెలిసి ఆందోళన చెందుతున్నారు.

Also Read: Srikakulam: రెండేళ్ల కొడుకుకి ఉరేసిన కన్న తల్లి, ఆ తర్వాత తాను కూడా - శ్రీకాకుళంలో దారుణం

Also Read: Rape On Cow : చివరికి ఆవును కూడా వదల్లేదు - రేప్ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కేశాడు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Bihar ACB Raids: ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Meerpet Husband Killed Wife  | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP DesamNara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Bihar ACB Raids: ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
Meerpet Husband Killed Wife  | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP Desam
Meerpet Husband Killed Wife | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP Desam
Shraddha Srinath: ఐ లవ్ యూ బాలయ్య.. అభిమానాన్ని ప్రేమ పూర్వకంగా తెలియజేసిన శ్రద్ధా శ్రీనాథ్!
ఐ లవ్ యూ బాలయ్య.. అభిమానాన్ని ప్రేమ పూర్వకంగా తెలియజేసిన శ్రద్ధా శ్రీనాథ్!
Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టులో షాక్... చెక్ బౌన్స్ కేసులో మూడు నెలలు జైలు శిక్ష
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టులో షాక్... చెక్ బౌన్స్ కేసులో మూడు నెలలు జైలు శిక్ష
Embed widget