By: ABP Desam | Updated at : 05 Jun 2022 02:37 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
విజయనగరం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచలనంగా మారింది. భర్తాభర్తలు ఇద్దరూ ఐటీ ఉద్యోగులు కావడం, వారు సొంతూరులో ఉండి ఇంటి నుంచే పని చేస్తున్న నేపథ్యంలో ఈ ఘోరం జరిగింది. భర్త ఓ గదిలో వర్క్ ఫ్రం హోం చేస్తుండగా, భార్య పక్క గదిలో ఉరి వేసుకుంది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలోని మయూరీ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు.
వివాహిత ఆత్మహత్య చేసుకున్నందుకు గల కారణం అత్తింటి వారి వేధింపులు అని పోలీసులు తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేకే వివాహిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. వివాహిత తరపు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని మయూరి జంక్షన్ వద్ద ఉండే నిర్మల అనే 27 ఏళ్ల యువతికి, అదే నగరంలోని స్థానిక బాలాజీ రోడ్డు నటరాజ్ కాలనీకి చెందిన భార్గవ్ అనే వ్యక్తికి 2020 ఏడాదిలో పెళ్లి జరిగింది. వీరు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యారు.
ఇది ఇలా ఉండగా వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త భార్గవ్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తరచూ నిర్మలను వేధిస్తూ ఉండేవారు. దీంతో ఆమె గతంలో చాలా సార్లు పుట్టింటికి వెళ్లిపోయింది. తాను ఇక కాపురానికి వెళ్లబోనని మొండికేసింది. అయితే, పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతగా బాలేకపోవడంతో నిర్మలకు నచ్చ చెప్పి ఆమె తల్లిదండ్రులు కాపురానికి పంపించారు.
మరోవైపు, అత్తారింటి నుంచి వేధింపులు మరీ తీవ్రం కావడంతో అటు పుట్టింటి వారితో చెప్పుకోలేక, ఇటు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరికి నిర్మల శనివారం తన ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, నిర్మల ఆత్మహత్య చేసుకుందా? లేక అత్తింటి వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. చనిపోయిన వివాహిత తండ్రి లక్ష్మణ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాన్ని అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నామని విజయనగరం త్రీటౌన్ పోలీసులు వెల్లడించారు.
Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు
TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు
Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు