అన్వేషించండి

Mobile Phone Death: గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!

Mobile Phone Head Injury Death: ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో ఘోర విషాదం. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, భార్య మొబైల్ ఫోన్‌తో తలపై కొట్టడంతో స్వప్నేశ్వర్ మిశ్రా అనే యువకుడు మృతి చెందాడు.

Domestic Violence Odisha Husband Dies: ఓ చిన్నపాటి కుటుంబ కలహం ఎంతటి ఘోర విషాదానికి దారితీస్తుందో చెప్పడానికి ఒడిశాలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. నిత్యం మనం చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్.. ఒకరి ప్రాణాలను బలితీసుకుంటుందని ఎవరూ ఊహించలేరు. ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో భార్యాభర్తల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. తీవ్ర కోపోద్రిక్తురాలైన భార్య, భర్త తలపై మొబైల్ ఫోన్‌తో బలంగా కొట్టడంతో అతను మరణించిన ఈ విచిత్ర, విషాద ఉదంతం వైరల్‌గా మారింది. 

బోలాంగిర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమ్నిభటి పాడ ప్రాంతానికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా అనే యువకుడికి, అతని భార్యకు మధ్య వీకెండ్‌లో ఒక్కసారిగా పెద్ద గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఆ సమయంలో తీవ్రమైన ఆగ్రహానికి లోనైన భార్య.. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకుని భర్త తలపై అత్యంత బలంగా బాదింది. మొబైల్ ఫోన్ గట్టిగా తగలడంతో స్వప్నేశ్వర్ తలకు తీవ్ర గాయమై, రక్తం కారడం ప్రారంభమైంది. 

గాయం తీవ్రతను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని బోలాంగిర్‌లోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి  తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చేరిన స్వప్నేశ్వర్‌కు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కొంత సమయం పాటు వైద్యుల పరిశీలనలో ఉంచిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ప్రాణాపాయం తప్పిందని భావించిన ఆసుపత్రి సిబ్బంది, అదే రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. దాంతో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.                        

కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే స్వప్నేశ్వర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తీవ్ర శ్వాసకోస ఇబ్బంది, నొప్పితో అతను స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. కంగారుపడిన బంధువులు సమయం వృథా చేయకుండా మళ్లీ అదే జిల్లా ఆసుపత్రికి పరుగు తీశారు. అయితే ఈసారి వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అంతర్గత గాయాల కారణంగా పరిస్థితి విషమించి స్వప్నేశ్వర్ శనివారం ఆసుపత్రిలోనే కన్నుమూశాడు.                    

భర్త మరణవార్త తెలుసుకున్న బోలాంగిర్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితురాలైన భార్యపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా కుటుంబ సభ్యులను, పొరుగువారిని విచారిస్తున్నారు. స్వప్నేశ్వర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మొబైల్ ఫోన్ దెబ్బ కారణంగానే తలలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందా లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడా అనేది పోస్ట్‌మార్టం నివేదికలో తేలనుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు  చెబుతున్నారు.                       

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget