అన్వేషించండి
Advertisement
Nizamabad News : నిజామాబాద్ లో రెచ్చిపోతున్న రౌడీ మూకలు, వరుసగా రెండు హత్యలు!
నిజామాబాద్ జిల్లాలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల పాతకక్షలతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు.
నిజామాబాద్ జిల్లాలో వరుసగా రెండు హత్యలు జరిగాయి. రౌడీ మూకలు పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని పక్కా ప్లాన్ తో మర్డర్ లు చేస్తున్నాయి. ఆదివారం నిజామాబాద్ నగరంలో... సోమవారం బోధన్ లో ఇద్దరు రౌడీ షీటర్లను పాతకక్షలతో రౌడీ మూకలు ప్లాన్ వేసి మరీ చంపేశారు. జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు తలపిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. నగరంలోని వన్ టౌన్, 5వ టౌన్, 6 వటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, పాత నేరస్తులు మారణాయుధాలతో రెచ్చిపోతున్నారు. సివిల్ తగాదాలతోపాటు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. ఇవి గోడవలకు దారితీస్తున్నాయి.
బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తే కేసు నమోదు చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవటం లేదన్నది ఆరోపణ ఉంది. రెండ్రోజుల క్రితం నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్ ప్రాంతంలో జరిగిన రౌడీషీటర్ ఇబ్రహీం చావూస్ అలియాస్ జంగల్ ఇబ్బూను మరో రౌడీషీటర్ ఆరిఫ్ డాన్ తన అనుచరులతో కలిసి కత్తితో దారుణంగా పొడిచి, బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించగా.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జంగల్ ఇబ్బూ ది ఆది నుంచి నేర చరిత్రే..
నగరంలోని బాబన్ సాహబ్ పహాడి ప్రాంతానికి చెందిన మృతుడు జంగల్ ఇబ్బూది ముందు నుంచి నేరచరిత్రే. 8 నెలల క్రితం ఆరో టౌన్ పరిధిలోని ఓ హోటల్ వద్ద అనుచరులతో కలిసి కొంత మందిపై దాడి చేశాడు. దాడి సంఘటన ఫ్యాక్షన్ తరహాలో కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీనిని పలువురు యువకులు సెల్ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో జంగిల్ ఇబ్బూతో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలిం చారు. రౌడీషీట్ ఉన్నప్పటికీ తన తీరును మార్చుకోకుండా మళ్లీ దాడులకు పాల్పడిన జంగిల్ ఇబ్బుపై పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు తరలించారు. కేవలం ఆరు నెలల్లోనే జంగిల్ ఇబ్బు బయటికి వచ్చాడు. జంగిల్ ఇబ్బు ప్రత్యర్థి అయిన మరో రౌడీషీటర్ డాన్ ఆరిఫ్ మధ్య ఏడాది కాలంగా చిన్నపాటు గొడవలున్నాయి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరూ గ్యాంగ్ లను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్, ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతూ.... జనాలను భయభ్రాంతులకు గురి చేయడం వృత్తిగా పెట్టుకున్నారు.
ధర్మపురి హిల్స్ ప్రాంతంలో జంగిల్ ఇబ్బుకు సంబంధించిన ప్లాట్లను......డాన్ ఆరిఫ్ అనుచరులతో కబ్జా చేయించినట్లు స్థానికుల కథనం. ఆ సమయంలో జంగిల్ ఇబ్బు పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లాడు. అయితే ఇబ్బు జైలు నుంచి విడుదలై వచ్చాక ప్లాట్ల విషయంలో తమతో గొడవకు దిగుతాడనే నెపంతో ఆరీఫ్ సమీప బంధువు ఒకరు పక్కా ప్లాన్ వేసి హత్య చేయించారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయ్. అర్షద్ అనే యువకుడి బర్త్ డే పార్టీ వంకతో నెహ్రూనగర్ ప్రాంతానికి ఇబ్బూను రప్పించి అక్కడ హత్యచేసినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. జంగిల్ ఇబ్బూ హత్య కేసులో అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితులను పోలీసులు అరెస్టు చేసే పనిలో ఉన్నారు. సోమవారం బోధన్ పట్టణం శక్కర్ నగర్ నర్సాపూర్ రోడ్డులో చాట్ల శివ (24) అనే యువకున్ని దారుణంగా చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి క్లూస్ టీమ్స్, డాగ్ స్కాడ్ రంగంలోకి దించారు. సీసీ పుటేజీల ద్వారా అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని తలిపారు.
కొత్త ఏడాది ఆరంభంలోనే రండ్రోజుల్లో వరుసగా రెండు హత్యలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో మాలాపల్లి, నాగారం, నెహ్రూ వంటి కొన్ని ఏరియాల్లో రౌడీ షీటర్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయ్. గతేడాది ఓ రౌడీ షీచర్ బర్త్ డే వేడుకల్లో తుపాకీ పేల్చి సంబరాలు జరిపిన విషయం తెలిసింది. నాగారంలో ఆటోను వెంబడించి అర్థరాత్రి యువకులను చితకబాదారు. ఇలా రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. పీడీ యాక్ట్ ఉన్న వారిపై పోలీసులు నిఘా ఉంచటం లేదు. రౌడీ షీటర్లు చేస్తున్న యాక్టీవిటీస్ పై పోలీసుల నజర్ తగ్గిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా రౌడీ మూకలకు అడ్డుకట్ట వేయకుంటే మరింత రెచ్చిపోయో ప్రమాదం ఉందంటున్నారు స్థానిక ప్రజలు.
సీపీ కె.ఆర్.నాగరాజు అల్లర్లు, గొడవలు చేసిన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయించడంతోపాటు పాత నేరస్తులపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేయించడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు మారణాయుధాలతో రెచ్చిపోతున్నారు.
మారణాయుధాలపై కానరాని నియంత్రణ.
పాత నేరస్తులు, గ్యాంగులు ఏర్పాటుచేసుకున్నవారు సెటిల్మెంట్లు చేస్తూ మారణాయుధాలతో వీరంగం సృష్టిస్తున్నారు. వీరి సమాచారం సంబంధిత పోలీసు స్టేషన్లో ఎందుకులేదని, దీనిపై పోలీసులు ఎందుకు ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రౌడీషీటర్స్, పాత నేరస్తులపై పోలీసు నిఘా కరువైందని ఆరోపిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement