అన్వేషించండి

Nandyala Crime News: ఒకరికి తెలియకుండా ఒకరితో మూడు పెళ్లిళ్లు, డబ్బులు తీసుకుంటూ మోసాలు!

Nandyala Crime News: ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోవాలని వేధిస్తూ... మూడో భార్య నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 

Nandyala Crime News: ఒకరికి తెలియకుండా ఒకరు.. ఇలా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య చనిపోతే ఆమె పేరిట ఉన్న భూమి వల్ల రైతు బీమా డబ్బులు వస్తాయని ప్లాన్ వేశాడు. ఆమెను ఆత్మహత్య చేసుకోమంటూ తరచూ వేధించడం మొదలు పెట్టాడు. అది భరించలేని ఆమె అతడికి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఈ క్రమంలోనే మూడో భార్య నుంచి ఐదు లక్షల రూపాయలు, ఆమె తల్లి ఫోన్ నుంచి ప్రైవేటు లోన్ యాప్ ద్వారా మరో ఐదు లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. చివరకు రెండో భార్యకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్ర బాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం దాచిపెట్టి తన గ్రామానికి చెందిన మరో మహిళను ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు సంబంధించిన బీమా డబ్బులు వస్తాయని తల్లి వద్ద ప్రస్తావించాడు. ఈ క్రమంలోనే భార్యను ఆత్మహత్య చేసుకోవాలంటూ వేధించాడు. అతడి వేధింపులు భరించలేని భార్య హైదరాబాద్ కు వెళ్లిపోయింది. మూడేళ్ల తర్వాత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళతో మహేంద్ర బాబు పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ.5లక్షలు, ఆమె తల్లి చరవాణి ద్వారా మోర 5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. 

అయితే మూడో పెళ్లి విషయం గురించి తెలుసుకున్న రెండో భార్య అతడిని నిలదీసింది. అనంతరం అతడిపై, అతడి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు తెలిపారు. ఈ క్రమంలోనే మహేంద్రబాబుతో పాటు అతడి తల్లి లక్ష్మీదేవిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. 

కోనసీమలో రోల్డ్ గోల్డ్ రింగ్ తొడిగి పెళ్లైందన్నాడు.. ఆపై అత్యాచారం!

కోనసీమ జిల్లాలో ప్రేమ పేరిట బాలికపై లైంగిక దాడి చేశాడో యువకుడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రోల్డ్ గోల్డ్ ఉంగరం తొడిగి బాలికతో శారీరకంగా కలిశాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో యువకుడు పరారయ్యాడు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని ఓ గ్రామంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరిట వెంటబడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు.  ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న బలవంతం చేశాడు. 12వ తేదీన బాలిక స్కూల్‌లో ఉండగా తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్దామని చెప్పిత బయటకు తీసుకెళ్లాడు. స్థానికంగా ఉన్న ఒక రూములోకి తీసుకెళ్లి రోల్డ్‌ గోల్డ్‌ ఉంగరం బాలికకు తొడిగి పెళ్లి అయిపోయిందని చెప్పి శారీరకంగా కలిశాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో యువకుడి పరారయ్యాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget