Abortion: యూట్యూబ్‌లో చూస్తూ సొంతగా అబార్షన్ చేసుకున్న రేప్ బాధితురాలు, ప్రియుడి సలహాతోనే.. చివరికి..
అత్యాచార ఫలితంగా గర్భం దాల్చిన ఒక యువతి.. యూట్యూబ్ వీడియోలు చూస్తూ సొంతంగా గర్భస్రావానికి ప్రయత్నించి, ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల వయసు ఉన్న ఓ యువతి తనకు తానే అబార్షన్ (గర్భస్రావం) చేసుకొనేందుకు ప్రయత్నించింది. యూట్యూబ్‌లో అబార్షన్ ఎలా చేయాలో వెతికి ఆ వచ్చిన వీడియోలను చూస్తూ తనకు తానే ఈ పని చేయడం గమనించదగ్గ విషయం. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read: 20 మంది పురుషులు.. ముగ్గురు మహిళలతో.. లారీలు అడ్డుగా పెట్టి ఘోరం, బహిరంగంగానే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యాచార ఫలితంగా గర్భం దాల్చిన ఒక యువతి.. యూట్యూబ్ వీడియోలు చూస్తూ సొంతంగా గర్భస్రావానికి ప్రయత్నించి, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నగరంలోని యశోధర నగర్‌లో రెండ్రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ షోయబ్ ఖాన్ అనే 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై రేప్ సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 2016 నుంచి షోయబ్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులతో చెప్పింది. ఆమె గర్భం దాల్చడంతో యూట్యూబ్ వీడియోలు చూసి, అబార్షన్‌కు ప్రయత్నించాలని, వాటిలో సూచించిన మందులను వాడాలని అతడే తనకు సలహా ఇచ్చినట్లుగా వెల్లడించింది. దీంతో పోలీసులు కంగుతిన్నారు.
Also Read: గుడ్‌న్యూస్! హైదరాబాద్-ముంబయి బుల్లెట్ రైలు కోసం కీలక ముందడుగు
‘‘షోయబ్ ఖాన్ ఇచ్చిన సలహాల మేరకు గర్భం దాల్చిన యువతి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ అబార్షన్ ప్రక్రియ చేపట్టింది. అది వికటించి ఆమెకు తీవ్రంగా రక్త స్రావం జరిగింది. దీంతో చుట్టుపక్కల వారు యువతిని హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని గుర్తించి మేం అరెస్టు చేశాం. ప్రస్తుతం అతను మా అదుపులోనే ఉన్నాడు’’ అని నాగ్‌పుర్ పోలీసులు వెల్లడించారు.
Also Read: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్.. చికెన్ పకోడితో సీక్రెట్ బయటకి..