Fake Currency Printing: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్.. చికెన్ పకోడితో సీక్రెట్ బయటకి..
యూట్యూబ్ చూసి దొంగ నోట్లు ముద్రించడం నేర్చుకుంది ఓ ముఠా. అయితే ఈ గ్యాంగ్ ను చికెన్ పకోడి పట్టించింది.
![Fake Currency Printing: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్.. చికెన్ పకోడితో సీక్రెట్ బయటకి.. Fake Currency Printing Gang Arrested In Ananthapuram Fake Currency Printing: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ప్రింటింగ్.. చికెన్ పకోడితో సీక్రెట్ బయటకి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/20/af5eedcbd274a505c975dd9265f33d53_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యూట్యూబ్ చూసి దొంగ నోట్లు ముద్రించడం నేర్చుకుంది ఓ ముఠా. అలా తయారు చేసిన నోట్లను చలామణి చేస్తూ.. ఎంజాయ్ చేసేవారు. అయితే వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిని పట్టించింది... ఎవరో వ్యక్తి... కాదు. చికెన్ పకోడి. అవును చికెన్ పకోడి కారణంగా వీళ్లు దొరికిపోయారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్‌బాషా పాల వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసేవాడు. రెండు మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లాడు. చికెన్ పకోడి కొనుగోలు చేసి వంద రూపాయల నోటు షాపు వారికి ఇచ్చాడు. అది పరిశీలించిన యజమాని అది నకలీ నోటు అని గుర్తు పట్టాడు. అసలు తీసుకోని అని చెప్పేశాడు.
నూర్ బాషా, షాపు యజమాని మధ్య జరుగుతున్న సంభాషణను అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గమనించాడు. అనుమానంతో వెళ్లి.. నూర్ బాషాను పట్టుకున్నాడు. వెంటనే తనిఖీ చేయగా.. అతడి వద్ద వంద రూపాయల నోట్లు 30 ఉన్నాయి. అవన్నీ నకిలీవే. నూర్ బాషాను జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
మెుదట ఎంత అడిగినా.. నూర్ బాషా నోరు విప్పలేదు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేయగా.. అసలు విషయం చెప్పాడు. అవన్నీ దొంగ నోట్లు తాము తయారు చేసినవేనని ఒప్పుకున్నాడు. యూట్యూబ్ లో నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నాని తెలిపాడు. అయితే ఒక్కడినే కాదని.. మరో ఇద్దరితో కలిసి .. ఈ దొంగనోట్లు తయారు చేస్తున్నట్టు నూర్ బాషా అంగీకరించాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు తెలిపాడు. 50 వేల రూపాయలు అసలైన నోట్లు తీసుకుని లక్ష నకిలీ నోట్లను అందజేయడంతోపాటు స్వయంగా తాము కూడా మార్కెటల్ చలామణి చేసినట్లు చెప్పాడు.
నిందితుడి అసలు విషయం చెప్పడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వెంటనే నూర్ బాషాను తీసుకుని.. కసాపురానికి వెళ్లారు జొన్నగిరి పోలీసులు. అతడి ఇంటిలో దొంగ నోట్ల ప్రింటింగ్ కి సంబందించిన స్కానర్, జిరాక్స్ మిషన్లు, నోట్ల తయారీకి ఉపయోగించే.. పేపర్ ను స్వాధీనం చేసుకున్నారు. నూర్ బాషాకు సహకరించిన ఖాజా, ఎన్,ఖాసీమ్ ను అరెస్టు చేసి కర్నూలు జిల్లా కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.
Also Read: Crime News: 8 నెలలుగా గ్యాంగ్ రేప్.. శిశువుకు జన్మనిచ్చిన బాలిక.. బిడ్డను ఏం చేశారంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)