అన్వేషించండి

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

Delhi Crime: ఢిల్లీలో మణిపూర్‌ జంటపై కొందరు దుండగులు దారుణంగా దాడి చేశారు.

Manipur Couple Beaten: 

ఢిల్లీలో ఘటన..

మణిపూర్‌కి చెందిన నలుగురు పౌరులపై ఢిల్లీలో అర్ధరాత్రి నడివీధిలో దాడి జరిగింది. 8-9 మంది గుంపుగా వచ్చి వాళ్లపై దాడి చేశారు. నవంబర్ 30 న రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దాడి జరుగుతుండగా పై నుంచి ఓ వ్యక్తి మొబైల్‌లో అదంతా రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టారు. అక్కడి సీసీ కెమెరాలోనూ ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇద్దరి ముఖం చాలా స్పష్టంగా కనిపించింది. మిగతా వాళ్లు ఎవరని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుల్లో మణిపూర్‌కి చెందిన ఓ జంటతో పాటు ఓ మహిళ, ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు. ఆ గుర్తు తెలియని దుండగులు వాళ్లను ఇష్టమొచ్చినట్టు కొట్టారు. రోడ్డుమీదకు లాక్కొచ్చారు. 

"నేను, నా భార్య, నా చెల్లి అందరం కలిసి మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ని ఇంటి దగ్గర దిగబెట్టేందుకు రాత్రి 11 గంటలకు వచ్చాం. ఆ సమయంలోనే ముగ్గురు వ్యక్తులు మా దగ్గరికి వచ్చారు. మొబైల్ బ్యాటరీ అయిపోయిందని చెప్పారు. క్యాబ్ బుక్ చేసుకోడానికి సాయం చేయాలని అడిగారు. సరే అని క్యాబ్ బుక్ చేస్తుంటే ఉన్నట్టుండి వాళ్లు నా భార్య, నా చెల్లిపై అసభ్యకరమైన కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. వెంటనే మేం రియాక్ట్ అయ్యాం. ఆ కోపంతో మాపై వాళ్లు దాడికి దిగారు. మరి కొంత మందికి కాల్ చేశారు. వాళ్లూ వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టారు"

- బాధితుడు

నిందితుల కోసం గాలింపు..

తన జుట్టు పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకుంటూ వెళ్లారని బాధిత మహిళ చెప్పింది. చంపేస్తారేమో అన్నంత భయం వేసిందని, అంతగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నలుగురు బాధితులకీ తీవ్ర గాయాలయ్యాయి. నిందితులందరినీ పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. 

Also Read: ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget