Hyderabad News: వ్యక్తి ఇంట్లో ఉండగా కూల్చివేత - అక్కడికక్కడే మృతి, హైదరాబాద్ లో ఘటన
Man Died After Demolition of Building: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఖాళీ చేసిన ఇంట్లో ఉండగా అది గమనించని యజమాని ఆ ఇల్లు కూల్చేయగా.. నిద్రించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కూకట్పల్లి పరిధిలో జరిగింది.
Man Died in Demolished Building: ఓ వ్యక్తి పాత ఇంటిని కూల్చేసి తిరిగి నిర్మించాలని పనులు చేపట్టగా.. ప్రమాదవశాత్తు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ (Kukatpally Police Station) పరిధిలో జరిగింది. మూసాపేటలో (Moosapeta) మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చేశారు. అంతకు ముందు రోజే ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న అందరినీ ఖాళీ చేయించారు. బుధవారం ఉదయం పాక్షికంగా పనులు చేపట్టారు. ఆ ఇంటిలో స్వామి రెడ్డి అనే వ్యక్తి అద్దెకు ఉండేవాడు. ఆయన రాత్రి మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటిలోకి వచ్చి గదిలో నిద్రపోయాడు. ఈ విషయం తెలియని యజమాని.. రాత్రి పనులు చేపట్టి ఇంటిని పూర్తిగా కూల్చివేయగా స్వామి రెడ్డి శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hyderabad News: హిట్ అండ్ రన్ కేసు - బాధితున్ని ఆస్పత్రిలో చేర్చి వైద్యుడు పరారీ