అన్వేషించండి

Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు

Honor Killing in Macherla | పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో నిందితుల నుంచి లంచం తీసుకోవడంతో పాటు వారికి సహకరించారని నిర్ధారణ కావడంతో సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు.

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన ఘటనలో, ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారి నిందితులకు సహకరించడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ కేసులో మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. నిందితుల నుంచి భారీగా డబ్బు తీసుకుని, బాధితురాలి ప్రాణాలు పోవడానికి కారకులయ్యారన్న ఆరోపణలతో సీఐని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

అసలేం జరిగిందంటే.. 
మాచర్ల పట్టణానికి చెందిన వ్యాపారి చంద్రశీను, గంగ దంపతుల కుమార్తె చౌడేశ్వరి (22) పరువు హత్యకు గురైంది. తమ పక్కింటికి వచ్చే నాగరాజు అనే యువకుడితో చౌడేశ్వరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆమె తండ్రి మాత్రం చౌడేశ్వరిని గవర్నమెంట్ టీచర్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. నిశ్చితార్థానికి సరిగ్గా రెండు రోజుల ముందు చౌడేశ్వరి తన ప్రియుడితో వెళ్లిపోయి పెద్దల్ని ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకుంది. నలుగురిలో పరువు పోయిందని, మరోవైపు మంచి సంబంధం తెస్తే చేసుకోకుండా నవ్వులపాలు చేసిందని భావించిన చంద్రశీను కుమార్తెపై కక్ష పెంచుకున్నాడు.

సీఐ సహాయంతో కుమార్తెను రప్పించిన తండ్రి

తన కుమార్తె ఇంట్లోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిందని తప్పుడు ఫిర్యాదు చేసి, పోలీసుల ద్వారా వారిని స్టేషన్‌కు రప్పించారు. చౌడేశ్వరి, నాగరాజు దంపతులు నరసరావుపేటలో తలదాచుకోగా, వారి ఆచూకీని కనిపెట్టిన పోలీసులు జంటను పీఎస్‌కు తీసుకెళ్లారు. తాను మేజర్‌నని, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని భర్తతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినప్పటికీ, డీల్ కుదుర్చుకున్న సీఐ ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఒక ఒప్పందం ప్రకారం ఆమెను 5 రోజుల పాటు పుట్టింటికి తీసుకెళ్లారు. తిరిగి భర్త దగ్గరకు వెళ్లాల్సిన మార్చి 19కి ఒకరోజు ముందే, అంటే మార్చి 18న చౌడేశ్వరి పుట్టింట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమెది హత్యేనని తేలింది.

పరువు తీసిందని చంపేశాను.. తండ్రి వాంగ్మూలం 

పోలీసుల విచారణలో చంద్రశీను తన తప్పును అంగీకరించాడు. ప్లాన్ ప్రకారం తన భార్య, కుమారుడిని పొలానికి పంపి, మేనల్లుడు శీనుతో కలిసి నిద్రిస్తున్న చౌడేశ్వరి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. గుండెలపై ఆడించిన తానే, తన పరువు తీసిందని ఆమె మీద కూర్చుని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిలో తలవంపులు తేవడంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో పాటు సీఐ పాత్రను సైతం వెల్లడించాడు. జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ ఆధ్వర్యంలో నిందితులను విచారిస్తున్నారు.

నిందితులకు సహకరించిన సీఐ, లంచం సైతం..
చౌడేశ్వరిని కుటుంబానికి అప్పగించిన తర్వాతే ఆమె హత్యకు గురైందని, ఆ సమయంలో సీఐ సెలవులో ఉన్నారని సమాచారం.  ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు పోస్టుమార్టం నివేదికను కూడా తారుమారు చేసేందుకు సీఐ వెంకటరమణ ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చౌడేశ్వరి ఆచూకీ కనిపెట్టి ఆమెను కుటుంబానికి అప్పగించేందుకు చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద రెండు విడతలుగా సీఐ నగదు తీసుకున్నట్లు విచారణలో తేలింది.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget