అన్వేషించండి

Hyderabad Drugs Party: హైదరాబాద్‌లోని రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు.. టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ 

Hyderabad Drugs Case: గోల్కొండ లోని తారామతి బారాదరి రిసార్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రైవేట్ పార్టీపై ఈగల్ టీం, పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ టెస్టులు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.

Hyderabad Drugs Party | హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి రిసార్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌పై తెలంగాణ ఈగల్ (EAGLE) బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో చంద్ర అనే వ్యక్తి నిర్వహించిన ఈ పార్టీకి సుమారు 200 మంది హాజరయ్యారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ పోలీసుల అనుమతి లేకుండానే ఈ వేడుకను ప్రారంభించినట్లు సమాచారం.

మద్యం వినియోగానికి ఎక్సైజ్ శాఖ అనుమతి ఉన్నప్పటికీ, డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్‌లో ఉన్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈగల్ డీఎస్పీ భిక్షపతి నేతృత్వంలోని బృందం గోల్కొండ పోలీసులతో కలిసి శనివారం రాత్రి అక్కడికి చేరుకుని ఒక్కసారిగా రిసార్టును ముట్టడించారు. ఎవరూ తప్పించుకోకుండా పకడ్బందీగా దాడులు నిర్వహించి, అనుమానం ఉన్న 36 మందికి డ్రగ్ కిట్లతో ఈగల్ టీం పరీక్షలు నిర్వహించింది. 

డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, పరం సి నిహార్, ఆశి, జాసన్ సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  అదుపులోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, గతంలో కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించారా? ఎవరెవరికి విక్రయించారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ముగిసిన రోహిత్ రెడ్డి కస్టడీ
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ ముగిసింది. శనివారం వారిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచగా, సిట్ అధికారులు నిందితులను మరో మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు కస్టడీ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేస్తూ, నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది.

ఇప్పటికే ఆరు రోజుల విచారణలో సిట్ పలు కీలక అంశాలను సేకరించింది. మార్చి 14న జరిగిన పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, విదేశీ పర్యటనలు, గతంలో జరిగిన డ్రగ్స్ పార్టీలపై పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెవరి ప్రమేయం ఉందనే అంశంపై విచారణ కొనసాగుతోంది.

 



About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget