అన్వేషించండి

Warangal Crime News: వరంగల్‌లో భార్య, కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టి చంపేసిన భర్త! ప్రమాదంగా డ్రామా! కుమారుడి కోసం ఘాతుకం!

Warangal Crime News:వరంగల్‌లో దారుణం జరిగింది. కుమారుడు కలగడం లేదని భార్య, బిడ్డలను చంపేశాడో భర్త. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించి దొరికేశాడు. 

Warangal Crime News: వరంగల్ నగర శివారులో స్విమ్మింగ్ పూల్‌లో మూడు శవాలు కనిపించాయి. అవి ఒకే కుటుంబానికి చెందినవి. గర్భిణీగా ఉన్న తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు. దాన్ని గుర్తించిన భర్త వెంటనే పోలీసులకు, బంధువులకు చెప్పాడు. వారు వచ్చి విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణానికి పాల్పడింది భర్తేనని, కుమారుడిని కని ఇవ్వడం లేదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలింది. 

పోలీసులు ఎలా గుర్తించారు?

వరంగల్‌ నగరంలో అజారుద్దీన్, భార్య ఫర్హ్‌, కుమార్తెలు ఉమేరా, ఆయేషాతో కలిసి ఉంటున్నారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కుటుంబంలో మూడు మరణాలు షాక్‌కి గురి చేశాయి. సమాచారం అందుకొని అక్కడకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ప్రారంభంలో అజారుద్దీన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో తన భార్య, పిల్లలు ప్రమాదవశాత్తు పూల్‌లో జారి పడి చనిపోయారని చెప్పాడు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే చాలా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఘటన జరగానికి కొద్ది నిమిషాల ముందే స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీటీవీ కెమెరాలు ఉద్దేశపూర్వకంగానే స్విచ్ ఆప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో అజారుద్దీన్ లొకేషన్ పూల్ వద్దే ఉన్నట్టు టెక్నికల్‌ ఎవిడెన్స్ ద్వారా తేలింది. పోలీసులు విచారిస్తున్న సమయంలో అజారుద్దీన్ చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. 

ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిపై ఎందుకింత కోపం ?

అజారుద్దీన్, పర్హత్‌లది ప్రేమ వివాహం. వారికి ఇప్పటికే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పర్హత్ మూడోసారి గర్భవతి. అయితే మూడో సంతానం కూడా ఆడపిల్లే పుడుతుందని అనుమానపడ్డాడు. తనకు కుమారుడు కావాలని, గర్భం తీయించుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. 

మాట వినని భార్య, ఇద్దరు ఆడపిల్లలను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు. అందుకు స్విమ్మింగ్ పూల్‌లోనే స్పాట్ పెట్టారు. ప్లాన్ ప్రకారం వారిని బుధవారం స్విమ్మింగ్ పూల్ వద్దు తీసుకెళ్లి నెట్టేశాడు. వారు చనిపోయే వరకు ఎదురు చూశాడు. తర్వాత బంధువులకు మిగతా వారికి సమాచారం అదించాడు.  

ఫర్హత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. దీంతో అతనిపై హత్యా నేరం కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు చెప్పాడు. భార్య చనిపోయిన తర్వాత పిల్లలను చూసుకునేందుకు ఎవరూ ఉండరని వారి కూడా చంపేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు తరలించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget