(Source: Poll of Polls)
లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?
లవర్స్ అంటే.. పార్కుల వెంట తిరగడం గురించే విన్నాం కదా. కానీ ఈ లవర్స్ రూటే సపరేటు.
లవర్స్ అంటే పార్కుల వెంట తిరుగుతారు. ఇంట్లో వాళ్లకి కనిపించకుండా సినిమాల కెళ్తారు. కానీ ఈ లవర్స్ మాత్రం అందుకు భిన్నం. ఏం చేస్తారో తెలిస్తే షాకవుతారు. ఇదేం ప్రేమ జంట రా నాయనా అనుకుంటారు.
విలాసవంతమైన జీవితానికి అలవాడు పడింది ఓ ప్రేమజంట. చేతిలో డబ్బులు లేవు. మరేం చేయాలి. ఓ వైపు.. ఎంజాయ్ చేస్తూ.. ఉండాలని ఆశలు. ఎలాగైనా డబ్బులు సంపాదించి.. విలాసవంతంగా జీవించాలని ప్లాన్ వేశారు. దొంగతనాలు చేసేందుకు అలవాడు పడ్డారు. ఆ సొమ్ముతో తెగ ఎంజాయ్ చేసేవారు.
ఈ ప్రేమ జంట.. చోరీలకు కూడా కాస్త వేరైటీగా ఉన్నాయి. ఇల్లు అద్దెకు కావాలంటూ.. వెళ్లేవారు. కాసేపు యజమానులతో మాట కలిపి.. నమ్మకం కలిగించేవారు. ఆ తర్వాత యజమానుల దృష్టి మరల్చి.. ఇంట్లోని వస్తువులను దొంగిలించేవారు. కర్ణాటకలోని బెంగళూరులో చాలా ఇళ్లలో చోరీలు చేశారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. ఈ తరహా దొంగతనాలు చేసింది.. వినయ్, కీర్తనగా పోలీసులు గుర్తించారు. వినయ్‌పై ఇప్పటికే రౌడీషీట్ ఉందని, ఓ హత్య సహా.. పలు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడని పోలీసులు చెబుతున్నారు.
మూడేళ్ల క్రితం వినయ్, కీర్తనకు పరిచయం అయింది. వాళ్లిద్ధరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఆశలు మెుదలై.. తనను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లాలని కీర్తన కోరింది. కాస్ట్లీ బహుమతులు ఇవ్వాలని చెప్పింది. అయితే ఈ క్రమంలోనే దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు వినయ్. వెంట తన గర్ల్ ఫ్రేండ్ ను కూడా తీసుకుపోయేవాడు. అక్టోబర్ 4న మారుతీనగర్ లోని ఓ ఇంటికి వెళ్లారు. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా పరిచయం చేసుకున్నారు. ఇల్లు అద్దెకు కావాలని చెప్పారు.
యజమాని దృష్టిని మరల్చి.. మెుబైల్ ఫోన్, ల్యాప్ టాప్, కొంత డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. ఇంట్లోని.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిచంగా అద్దెకోసం వచ్చిన వాళ్లే.. దొంగతనం చేసినట్టు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగోలా దొంగ లవర్స్ దొరికారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినా.. అతడిని ప్రేమిస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. అతని కోసం ఏమైనా చేస్తానని.. జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది.
Also Read: Maoist Booby Traps: మావోయిస్టుల కొత్త వ్యూహం... బూబీ ట్రాప్స్ తో భద్రతా బలగాలకు కత్తిమీద సాము
Also Read: Afghanistan Blast: అఫ్ఘనిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి.. 50 మందికి పైగా మృతి.. భయానక పరిస్థితులు!