Afghanistan Blast: అఫ్ఘనిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి.. 50 మందికి పైగా మృతి.. భయానక పరిస్థితులు!
అఫ్ఘనిస్థాన్ లో మసీదు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడి జరిగింది. 50 మందికి పైగా మృతి చెందగా, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తాలిబన్ పోలీసులు వెల్లడించారు.
![Afghanistan Blast: అఫ్ఘనిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి.. 50 మందికి పైగా మృతి.. భయానక పరిస్థితులు! Afghanistan Blast At least 50 killed in Afghan Kunduz mosque blast Afghanistan Blast: అఫ్ఘనిస్థాన్‌లో మసీదుపై ఆత్మాహుతి దాడి.. 50 మందికి పైగా మృతి.. భయానక పరిస్థితులు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/8f3cbdc0c2491b189f2df7e3ec1f920e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అఫ్ఘనిస్థాన్ లో దారుణం జరిగింది. మసీదు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నార్త్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తాలిబన్ పోలీసు అధికారులు వెల్లడించారు.
అఫ్గాన్‌లోని నార్త్ కుందుజ్ ప్రావిన్స్‌లో మసీదు లక్ష్యంగా దాడి జరిగినట్లు సమాచారం. షీతె ముస్లింలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం కావడంతో మసీదులో ఎక్కు మంది ఉంటారని, సరిగ్గా అదే సమయంలో ఆత్మాహుతి దాడి జరిపితే భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుందని ప్లాన్ వేశారు. మసీదులో ఉన్న వారిలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. షీతె ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు గతంలోనూ దాడులు చేశారు.
Also Read: చైనా సరిహద్దులో మళ్లీ ఘర్షణ, చొరబాటుకు యత్నం.. 200 మంది చైనా సైన్యాన్ని అడ్డగించిన భారత్
#UPDATE | At least 50 dead in Afghanistan's Kunduz mosque blast, as per hospital sources: AFP News Agency
— ANI (@ANI) October 8, 2021
ఈ ఏడాది ఆగస్టు చివర్లో అమెరికా మరియు నాటో సంయుక్త బలగాలు ఆఫ్ఘనిస్థాన్ ను వీడిన తరువాత జరిగిన అతి పెద్ద మిలిటెంట్ దాడి ఇది అని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం గోజర్ ఈ సయీద్ అబాద్ మసీదులో ప్రజలు అధికంగా ఉంటారని భావించి ఉగ్రదాడికి పాల్పడినట్లు అధికార ప్రతినిథి తెలిపారు. చూస్తుండగానే భారీ సమూహంలో బాంబు పేలిందని ప్రత్యక్ష సాక్షి అలీ రెజా తెలిపాడు. మొదట 100 మందికి పైగా చనిపోయారని కథనాలు రాగా, 50 మంది మరణించారని అధికారులు ప్రకటించారు.
ఆత్మాహుతి దాడిపై తాలిబన్ అధికార ప్రతినిధి బబీవుల్లా ముజాహిద్ స్పందించారు. షీతె ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ప్రార్థనలు చేస్తున్న సమయంలో అయితే ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని భావించి ఈ దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. తాలిబన్ స్పెషల్ ఫోర్సెస్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఏ గ్రూప్ కూడా ఈ దాడి తమ చర్య అని ప్రకటించుకోలేదు. తాలిబన్ల పాలనలో అఫ్గాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విదేశాలకు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)