అన్వేషించండి

Srisailam Kannada Devotees : శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం, తాత్కాలిక షాపులకు నిప్పు పెట్టిన యువకులు

Srisailam Kannada Devotees Issue : శ్రీశైలంలో కన్నడ భక్తులు విధ్వంసం సృష్టించారు. టీ షాపు నిర్వాహకుడితో మొదలైన గొడవ పెద్దదై తాత్కాలిక దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో కన్నడ భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి.

కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆలయ పరిధిలో కన్నడ భక్తులు వీరంగం సృష్టించారు. టీ షాపు వద్ద కన్నడ భక్తులు, దుకాణాదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో కన్నడ భక్తులు షాపులు, కార్లు, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. కన్నడ భక్తులు ఓ టీ దుకాణానికి నిప్పు పెట్టారు. షాపు యజమానుల దాడిలో కన్నడ భక్తుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని జగద్గురు పీఠాధిపతి పరామర్శించారు. 

తాత్కాలిక దుకాణాలకు నిప్పు 

శ్రీశైలం దేవాలయం పరిధిలోని తాత్కాలిక షాపులకు కన్నడ యువకులు నిప్పు పెట్టారు. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ దాడిలో 100 పైగా దుకాణాలు, 30 కార్లు, 10 బైక్ లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిళ్లినట్లు సమాచారం. టీ షాపు నిర్వాహకుడికి కన్నడ భక్తులకు మధ్య వాటర్ బాటిల్ విషయలో వాగ్వాదం చోటుచేసుకుంది. కన్నడ భక్తుడిపై టీ షాపు నిర్వాహకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ఈ దాడితో వెంటనే అక్కడికి చేరుకున్న కన్నడ భక్తులు స్థానికంగా విధ్వంసం సృష్టించారు. దీంతో శ్రీశైలంలో భారీగా పోలీసులు మోహరించారు. కన్నడ భక్తులు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. 

అసలేం జరిగిందంటే?

శ్రీశైలంలో కన్నడ భక్తులు ఆందోళనకు దిగారు. పలు దుకాణాలపై దాడులు చేశారు. మరికొన్ని షాపులకు నిప్పంటించి రణరంగం సృష్టించారు. తెలుగోళ్లు కనబడితె చాలు విచక్షణారహితంగా కర్రలతో దాడులకు పాడ్డారు. లక్షల రూపాయలు సొమ్ము నష్టం వాటిల్లేలా బీభత్సం సృష్టించి స్థానికులను భయబ్రాంతులకు గురయ్యేలా కర్రలు పట్టుకుని రోడ్లపై అరుచుకుంటూ తిరుగుతూ కనపడినవారిని కనపడినట్లు చితకబాదారు. శ్రీశైలంలోని పలు షాపులకు నిప్పు పెట్టి ఆగ్నికి ఆహుతి చేశారు. కన్నడిగుల బీభత్సాన్ని చూసి స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. మీడియా కవరేజ్ చేసేందుకు వెళ్లిన‌ కొందరిని కన్నడిగులు కర్రలతో వెంబడించారు. 

మూడు గంటల వరకూ బీభత్సం

శ్రీశైలంలోని పాతాళగంగ రోడ్డులోని కురువ సత్రం సమీపంలో ఒక దుకాణంలో వాటర్ బాటిల్ కొనేందుకు వెళ్లిన‌ కన్నడ భక్తులు షాపు యజమానికి రేటు విషయంలో గొడవపడ్డారు. అక్కడ నుంచి వెళ్లిన కన్నడిగులు కాసేపటికి మరికొంత మందితో వచ్చి గొడవలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడితో ఆగక షాపులోని సామాన్లు బయటకు విసిరి షాపుకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. అక్కడ మొదలైన గొడవ శ్రీశైలంలోని నంది సర్కిల్ మల్లికార్జునసదన్, శివసదన్, అన్నదాన మందిరం, జగద్గురు పీఠం సమీపంలో కొన్ని షాపులపై దాడులు చేసి స్థానికులు, భక్తులను భయాందోళనకు గురిచేశారు. అంతే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు కొందరు చేరుకుని గట్టిగట్టిగా కేకలు వేస్తూ అల్లర్లు సృష్టించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా వెనుకడుగు వేశారు. కొన్ని గంటల వరకు అల్లరి మూకలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది.

పరిస్థితి అదుపులోకి 

దీంతో రంగంలోకి దిగిన ఆత్మకూరు డీఎస్పీ శృతి పోలీసు సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులో తెచ్చారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము మూడు గంటల వరకు కన్నడిగుల బీభత్సం సృష్టించారు. డీఎస్పీ శృతి ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్ చేశారు. నాలుగు గంటలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శ్రీశైలంలో ప్రసుత్తం పరిస్థితి అదుపులోకి వచ్చింది.  శ్రీశైలం వీధుల్లో పోలీసులు పహారాకాస్తున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
Anna Canteens: ఏపీలో మళ్లీ రంగుల రాజకీయం - అన్న క్యాంటీన్ లపై హైకోర్టులో పిటిషన్
ఏపీలో మళ్లీ రంగుల రాజకీయం - అన్న క్యాంటీన్ లపై హైకోర్టులో పిటిషన్
Gold-Silver Prices Today 22 Sept: మీ దగ్గర 76k ఉంటేనే 10 గ్రాముల పసిడి వస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
మీ దగ్గర 76k ఉంటేనే 10 గ్రాముల పసిడి వస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
Anna Canteens: ఏపీలో మళ్లీ రంగుల రాజకీయం - అన్న క్యాంటీన్ లపై హైకోర్టులో పిటిషన్
ఏపీలో మళ్లీ రంగుల రాజకీయం - అన్న క్యాంటీన్ లపై హైకోర్టులో పిటిషన్
Gold-Silver Prices Today 22 Sept: మీ దగ్గర 76k ఉంటేనే 10 గ్రాముల పసిడి వస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
మీ దగ్గర 76k ఉంటేనే 10 గ్రాముల పసిడి వస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Jamili elections : జమిలీ ఎన్నికలకు బీఆర్ఎస్ అనుకూలమేనా  ?  కాంగ్రెస్ వ్యతిరేకించిందని సమర్థిస్తారా ?
జమిలీ ఎన్నికలకు బీఆర్ఎస్ అనుకూలమేనా ? కాంగ్రెస్ వ్యతిరేకించిందని సమర్థిస్తారా ?
Tirumala News: బ్లాక్‌లో శ్రీవారి దర్శన టికెట్లు, పెద్దిరెడ్డి, రోజాకు రోజుకు రూ.కోటి ఆదాయం - టీడీపీ సంచలన ఆరోపణలు
బ్లాక్‌లో శ్రీవారి దర్శన టికెట్లు, పెద్దిరెడ్డి, రోజాకు రోజుకు రూ.కోటి ఆదాయం - టీడీపీ సంచలన ఆరోపణలు
Kakinada: డాక్టర్‌ని కొట్టిన జనసేన ఎమ్మెల్యే! బూతులతో మెడికల్ కాలేజీ వైస్ ఛైర్మన్‌పై దాడి
డాక్టర్‌ని కొట్టిన జనసేన ఎమ్మెల్యే! బూతులతో మెడికల్ కాలేజీ వైస్ ఛైర్మన్‌పై దాడి
Weather Latest Update: రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ
రేపటికి మరో కొత్త అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - ఐఎండీ
Embed widget