Konaseema District: అమలాపురం అల్లర్ల కేసులో మరో 15 మంది అరెస్ట్, ఏ ఒక్కరినీ వదిలేది లేదన్న కోనసీమ ఎస్పీ సుధీర్
Amalapuram Violence Case: కోనసీమ జిల్లా అమలాపురంలో మే నెల 24న జరిగిన అల్లర్ల కేసులో మరో 15 మంది అరెస్ట్ చేశామని, మొత్తం అరెస్టుల సంఖ్య 245కు చేరిందని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. అల్లర్లతో సంబంధం ఉన్న మరి కొందర్ని పక్కా అధారాలతో తాజాగా అరెస్ట్ చేసినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈకేసుకు సంబంధించి పలు విషయాలను ఎస్పీ వెల్లడించారు.
మే నెలాఖరులో జరిగిన అమలాపురం అల్లర్ల కేసులో నిందితుల పాత్ర గురించి వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. వీరిలో కురసాల నితీష్, మద్దాల సంతోష్, పల్నాటి ప్రశాంత్ బాబు, తోట దుర్గాప్రసాద్, వరదా రాజేష్ తోపాటు ఒక మైనర్ లు ఉన్నారని తెలిపారు. గతంలో 228 మందిని పూర్తి అధారాలతో అరెస్ట్ చేశారని, తాను జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక మరో 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. దీంతో అమలాపురం అల్లర్ల కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 243కు చేరింది.
పంచాయతీ కార్యదర్శి కేసులోనూ ముగ్గురు అరెస్ట్..
ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయితీ కార్యదర్శి రొడ్డా భవాని అత్మహత్య కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో మృతురాలి కుటుంబీకులు, ప్రజా సంఘాలు నుంచి స్థానికంగా ఉండే ఓ నాయకుని వేధింపుల కారణంగానే పంచాయతీ కార్యదర్శి అత్మహత్యకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయని, ఈనేపథ్యంలో అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ద్వారా దర్యాప్తు చేశారన్నారు. మృతురాలికి దాదాపు రూ. 57.35 లక్షల బ్యాంకు అప్పులున్నాయని, దీంతోపాటు మానసికంగా, అరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుందని, ఉద్యోగ విషయంలోనూ తీవ్ర ఒత్తిడికి గురైందన్నారు.
ఆమె సెల్ ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా సమగ్ర విచారణ చేస్తే ఉద్యోగుల బదిలీలలో భాగంగా అమె వరసాల సత్యనారాయణ అనే వ్యక్తికి రూ.32,500, యర్రంశెట్టి నాగరాజు, ముత్తాబత్తుల సూరిబాబు అనే వ్యక్తులకు రూ.10 వేలు చొప్పున ఇచ్చినట్లు ఆమె సెల్ ఫోన్‌లో వాయిస్ రికార్డులున్నాయని వెల్లడించారు. అయితే అరోపణలు వచ్చినట్లుగా ఓ నేత ప్రమేయం గురించి ఎక్కడా అధారాలు లభ్యం కాలేదని, అన్నీ పరిశీలించిన తరువాత డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకునని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏమైనా అధారాలు ఉండి అందిస్తే చర్యలు తీసుకుంటామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పారు.
Also Read: Maosists Vaarotsavalu: మావో వారోత్సవాల నిర్వీర్యాని కై పోలీసుల ముందస్తు చర్యలు!
Also Read: Subhash Patriji No More : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత