Subhash Patriji No More : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత
Subhash Patriji No More : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆయన మరణించారు.
Subhash Patriji No More : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌కు ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం పత్రిజీ మరణించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్ ధ్యాన్ ట్రస్టు తెలిపింది. సుభాష్ పత్రిజీ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ బోధన్‌లో జన్మించారు. కర్నూలు జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగం చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌ను 2012లో నిర్మించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను పత్రిజీ స్థాపించారు.
పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ మరణం బాధాకరం . పిరమిడ్ కేంద్రం ద్వారా అనేక రకాల ధ్యానం ప్రచారంలో విశేషంగా చేసిన వారుతేసిన సేవలు గుర్తించదగినవి . వారి మరణం పట్ల నా సంతాపం , వారి భక్తులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను .#SubhashPatri pic.twitter.com/AA4uX1idEM
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 24, 2022