ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 3 రోజులపాటు వర్షాలు

ఉత్తర తెలంగాణలో జిల్లాలకు రెడ్ అలర్ట్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నేడు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది

ఏపీలోనూ జూలై 28 వరకు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షం

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి

ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సైతం వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది