లాల్ సింగ్ చద్దా ట్రైలర్ లాంచ్‌లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఈ సినిమాలో జోడిగా నటించారు. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ యువసామ్రాట్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. సీక్రెట్ సూపర్ స్టార్ దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది. ఈ ఈవెంట్‌లో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య తెలుగు డైలాగ్ చెప్పించారు.