వెస్టిండీస్‌తో ఎంతో థ్రిల్లింగ్‌గా సాగిన రెండో వన్డేలో టీమిండియా రెండు వికెట్లతో విజయం సాధించింది.



ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.



వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ (115) 100వ వన్డేలో సెంచరీ చేయడం విశేషం.



టీమిండియా 49.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.



అక్షర్ పటేల్‌కు (35 బంతుల్లో 64) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేసి టీమిండియా గెలవడం విశేషం.

వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ (74) కూడా రాణించారు.



భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు.



టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (63), సంజు శామ్సన్ (54) అర్థ సెంచరీలు సాధించారు.



వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
(All Images Credits: BCCI/ICC)