Suryapet: క్రిప్టోపై బిల్లుపై కేంద్రం ప్రకటన.. సూర్యాపేటలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మంకు చెందిన వ్యక్తి క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారు. విపరీతంగా ఆయన పెట్టుబడులు క్రిప్టోపై పెట్టడంతో దాదాపు రూ.70 లక్షల వరకూ పోగొట్టుకొన్నాడు.
క్రిప్టో కరెన్సీ మార్కెట్ల ప్రభావం పలువురి ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది. క్రిప్టో కరెన్సీలపై ఆన్ లైన్ ట్రేడింగ్‌లో భాగంగా ఈ మధ్య చాలా మంది వివిధ డిజిటల్ కాయిన్స్‌పై పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మంకు చెందిన వ్యక్తి కూడా పెట్టుబడులు పెట్టారు. విపరీతంగా ఆయన పెట్టుబడులు క్రిప్టోపై పెట్టడంతో దాదాపు రూ.70 లక్షల వరకూ పోగొట్టుకొన్నాడు. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేటలో ఓ లాడ్జిలో విషం తాగి తనువు చాలించాడు.
బుధవారం సూర్యాపేటలో వెలుగు చేసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమీది రామలింగ స్వామి అనే 38 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడి సాయంతో ఆన్‌లైన్‌లో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రిప్టో నియంత్రణ బిల్లు తేనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో క్రిప్టో మార్కెట్లలో డిజిటల్ కాయిన్స్ విలువ చాలా పడిపోయింది. దీంతో అసలే రూ.70 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టిన ఆయనకు భారీగా నష్టాలు రావడంతో మొత్తం అప్పులు అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు కారు లాక్కోని, చెక్కులపై సంతకాలు పెట్టించుకుని వేధించినట్లు పోలీసులు వెల్లడించారు.
పెద్ద ఎత్తున డబ్బును పొగొట్టుకున్న రామలింగ స్వామి ఈ నెల 22న సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రామ లింగస్వామి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా.. రామలింగ స్వామి బాత్‌రూమ్‌లో విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, ఆ గదిలోనే ఓ లేఖ కూడా పోలీసులు గుర్తించారు. క్రిప్టో మార్కెట్లలో నష్టాలతోనే తాను చనిపోతున్నట్టు రామలింగస్వామి సూసైడ్ నోట్ రాశాడు. రామలింగస్వామి భార్య, తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also Read: Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. ఏడాదిగా అదే పని.. చివరికి..
Also Read: Visakhapatnam: అమెజాన్‌లో కరివేపాకు పొడి.. తెరిచి చూస్తే గంజాయి.. నలుగురి అరెస్టు
Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..