Crime News: పిల్లాడు కాదు.. కామాంధుడు.. పొలాల్లోకి లాక్కెల్లి.. 21 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం
ఓ 15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.
కేరళలో దారుణ ఘటన జరిగింది. ఓ బాలుడు యువతిపై అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. ఒంటరిగా నడిచివెళుతున్న యువతిని బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. 15 ఏళ్ల వయసులో ఆ బాలుడు ప్రవర్తించిన తీరు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అతడిని పురికొల్పిన పరిస్థితులు ఆందోళన కలిగించే విషయం.
అసలు వివరాల్లోకి వెళ్తే..
మలప్పురం జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు.. 21 ఏళ్ల యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బాధితురాలు కంప్యూటర్ క్లాస్‌కు వెళ్తున్న విషయాన్ని గమనించాడు బాలుడు. ఆమె నడుస్తుంటే.. ఆమెకు తెలియకుండా వెనకలే నడిచాడు. ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్లాక.. ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆమె తలపై రాయితో కొట్టి, చేతుల్ని దుప్పట్టాతో కట్టేశాడు. ఆ తర్వాత ఆమె గొంతు నొక్కి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దగ్గరలోని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లింది.
అయితే సోమవారం జరిగిన ఈ ఘటనపై.. మంగళరం పోలీసులకు ఫిర్యాదు అందింది. కారణంగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాలుడి కోసం వెతికారు. అదుపులోకి తీసుకుని.. అనంతరం జువైననల్ హోమ్ కు తరలించారు. మొదట్లో నిందితుడు తానీ నేరం చేయలేదని విచారణలో తెలిపాడు. అయితే పోలీసులు కాస్త గట్టిగా అడగడంతో నిజాన్ని అంగీకరించాడు. అయితే యువతి అంతకుముందు ఎప్పుడూ అతడిని చూడలేదని చెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. యువతి చెప్పిన సమాచారం ఆధారంగా బాలుడిని ప్రశ్నించనున్నారు. మరోపక్క, ఆ బాలుడికి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad Realtor: కత్తి దాడి జరిగిన హైదరాబాద్ రియల్టర్ మృతి.. నిందితుడు అల్లుడే..
Also Read: Hyderabad: డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఘోరం.. పొద్దున్నే తలుపులు తెరిచిన సిబ్బంది షాక్
Also Read:- Murder Case: ఆత్మహత్య కాదు.. హత్యే.. రాత్రి వొడ్కా తాగి.. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆపై..
Also Read: విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. డిజిటల్ కీ సాయంతో ఒకే కంపెనీ ఏటీఎంలలో చోరీలు చేస్తారు