News
News
X

విమానాల్లో దేశమంతా తిరుగుతారు.. డిజిటల్ కీ సాయంతో ఒకే కంపెనీ ఏటీఎంలలో చోరీలు చేస్తారు

ఓ ముఠా దొంగతనాలు చేసేందుకు కూడా విమానాల్లో వస్తారు. లాడ్జిల్లో తిష్ట వేస్తారు.. రాత్రి సమయంలో వాళ్ల పని ఎంచక్కా కానించేసి చెక్కెస్తారు.

FOLLOW US: 
 
ఆరుగురు సభ్యులు.. ముఠాగా ఏర్పడ్డారు. వారంతా హరియాణాకు చెందిన వాళ్లే. ఏ రాష్ట్రంల్లో చోరీ చేయాలో ముందే డిసైడ్ అవుతారు. ఇక ఆ రాష్ట్రానికి విమానంలో వెళ్తారు. ఇలా దేశమంతా తిరుగుతారు. అయితే వీరు ఏ ఏటీఎంలో పడితే ఆ ఏటీఎంలో దొంగతనం చేయారు. ఓన్లీ ఒకే కంపెనీ ఏటీఎంలో మాత్రమే చోరీ చేస్తారు. అలా నిజామాబాద్ జిల్లాకు వచ్చి దొరికిపోయారు. 
ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ నెల 16న రాత్రి 7.30కు ఓ అనుమానిత లావాదేవీ అయింది. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా ముందుగానే గుర్తించారు బ్యాంకు సిబ్బంది. అదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్ కు చెప్పారు. అప్రమత్తమైన మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు మెుదలుపెట్టిన పోలీసులు.. అరగంట టైమ్ లో 30 వేల రూపాయలను డిజిటల్ కీ సాయంతో విత్ డ్రా చేశారని గుర్తించారు. సీసీ టీవీల ఆధారంగా వారు ఎక్కడ బస చేస్తున్నారని గుర్తించారు. రైల్వేస్టేష్టన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు ఉన్నట్టు తెలుసుకున్నారు. వెళ్లి తనికీ చేసి.. మహమ్మాద్‌ అల్తాబ్‌, వకీల్‌ అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారి నుంచి రూ.30 వేల నగదు, రెండు ఫోన్లు, రెండు ఏటీఎం మానిటర్‌ డిజిటల్‌ కీలు, వివిధ బ్యాంకులకు చెందిన 11 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హరియాణాలోని పాల్వాల్‌ జిల్లాకు చెందిన షాకీర్‌ గ్యాంగ్ లీడర్ గా అల్తాబ్‌, వకీల్‌ అహ్మద్‌, అమీర్‌ సోహెల్‌, ఆషిక్‌, ఇన్సాఫ్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు. హ్యోసంగ్‌ కంపెనీ ఏటీఎంలను మాత్రమే  లక్ష్యంగా చేసుకుంటారు. ఎక్కడికి వెళ్లాలో ముందుగానే డిసైడ్ అయి అక్కడికి విమానంలో వెళ్తారు. బస చేసిన ప్రాంతానికి దగ్గరలో ఉండే ఏటీఎంలను ఎంచుకుంటారు. రాత్రి సమయంలో సీసీ కెమెరాలకు కనిపించకుండా బయటకు వచ్చేస్తారు.
అయితే వారి దగ్గర ఉన్న కార్డులతోనే నగదు విత్ డ్రా చేస్తారు. డబ్బులు వచ్చే టైమ్ కి డిజిటల్ కీ సాయంతో సెన్సార్ పని చేయకుండా చేస్తారు. ఇలా చేస్తే.. మనీ విత్ డ్రా అయినా.. ఖాతాలో డబ్బులు కట్ అవ్వవు. ఇలా కావల్సినంత డబ్బులు విత్ డ్రా చేసుకుని.. ఇక ఆ రాష్ట్రం నుంచి చెక్కెస్తారు.  ఈ మేరకు ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌ వివరాలు వెల్లడించారు. దర్యాప్తు చేసి.. చేధించిన సిబ్బందిని అభినందించారు.

Also Read: Phone Hacked: అమ్మ బాబోయ్.. ఒకే ఒక్క మెసేజ్ తో నా ఫోన్ హ్యాక్.. నేనెపుడు చూడలా.. మీరు జాగ్రత్త

Also Read: Crime News: ఫేస్ బుక్ పరిచయం.. ప్రియురాలు రమ్మంటే రాత్రి వెళ్లాడు.. ఆ దుంగ లేకుంటే ఏమయ్యేదో

News Reels

Published at : 27 Oct 2021 01:50 PM (IST) Tags: telangana crime news Haryana Theft Thief Gang Nizamabad police

సంబంధిత కథనాలు

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Loan App Threats : అందరికీ దూరంగా వెళ్లిపోతున్నా! స్నేహితులకు లాస్ట్ కాల్, ఆ తర్వాత!

Loan App Threats : అందరికీ దూరంగా వెళ్లిపోతున్నా! స్నేహితులకు లాస్ట్ కాల్, ఆ తర్వాత!

Nirmal Bus Electrocution : విహారయాత్ర బస్సును తాకిన విద్యుత్ తీగలు, బస్సులో 56 మంది విద్యార్థులు!

Nirmal Bus Electrocution :  విహారయాత్ర బస్సును తాకిన విద్యుత్ తీగలు, బస్సులో 56 మంది విద్యార్థులు!

టాప్ స్టోరీస్

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?