అన్వేషించండి

Crime News: ఫేస్ బుక్ పరిచయం.. ప్రియురాలు రమ్మంటే రాత్రి వెళ్లాడు.. ఆ దుంగ లేకుంటే ఏమయ్యేదో

వారిద్దరికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులు మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ప్రియురాలు రమ్మంటే వెళ్లాడు. కానీ.. అక్కడ జరిగింది వేరు.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతలా  పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే వరకు చాలా మంది జీవితాల్లో అదో భాగమైపోయింది. అనేకమంది సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. అయితే అలా చేయడం వలన జరిగే అనర్థాలను చూస్తూనే ఉన్నాం. ఓ వ్యక్తి కూడా ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం ప్రాణాల మీదకు తెచ్చింది.

భవానీపురానికి చెందిన యార్లగడ్డ డేవిడ్‌ విజయవాడలో ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ ఇద్దరికి రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల మాట్లాడుకున్న తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. యువతి సోమవారం సాయంత్రం యువకుడికి ఫొన్ చేసింది. మైలవరం మండలం పుల్లూరులోని మామయ్య ఇంట్లో ఉన్నానని చెప్పింది. రాత్రికి గుంటూరులో పెళ్లికి వెళ్లాలని.. తనను తీసుకెళ్లాలని కోరింది. అయితే ఇదే విషయాన్ని నమ్మేశాడు ప్రియుడు.

రాత్రి 9 గంటల సమయంలో కారులో పుల్లూరుకు వెళ్లాడు. తాను వచ్చానని చెప్పాడు. అడ్రస్ చెప్పమని కోరాడు. అయితే తన సోదరుడు వచ్చి.. తీసుకొస్తాడని యువతి చెప్పింది. ఇదే విషయాన్ని నిజం అనుకున్నాడు ప్రియుడు. కొద్దిసేపటి తర్వాత యువతి సోదరుడు, మరో వ్యక్తి వచ్చి కారులో అతడ్ని జమలాపురం వైపు తీసుకెళ్లారు. దారిలోనే బ్లేడుతో అతని మెడ, చేతులు కోసేశారు. అప్పటికే ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే కారులో తీసుకుని జి.కొండూరు మండలం కవులూరు, శాంతినగర్‌ మధ్య మార్గంలోని బుడమేరు కాలువలో పడేశారు. 

ప్రియుడి దగ్గర నుంచి ఫోన్‌, ఉంగరాలు లాక్కొని జంప్ అయ్యారు. కారును జి.కొండూరు, చెవుటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారి బైపాస్‌లో విడిచిపెట్టారు. అయితే కాలువలో పడి ప్రాణాలు కోసం పోరాడుతున్న ప్రియుడికి అదృష్టవశాత్తు  దుంగ దొరకడంతో ఎలాగొలా ఒడ్డుకు వచ్చాడు. రహదారి మీద వెళ్తున్న ఆటోను ఆపి.. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫొన్ చేసి చెప్పాడు. 

ఇబ్రహీంపట్నం పోలీసుల సాయంతో విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని ప్రేమించానని, ఆమె రమ్మంటే వెళ్లానని.. యువకుడు ఫొటోలు చూపుతున్నాడు. ఆ యువతి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంపైనా.. ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Also Read: Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..

Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Embed widget