అన్వేషించండి

Karimnagar: యువకుడి హత్య కేసులో నమ్మలేని నిజం - అతని ఫ్యామిలీ మొత్తం అవాక్కు!

Karimnagar News: బావమరిది భూములు అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయలను అక్రమంగా చేజిక్కించుకోవాలని వేసిన మాస్టర్ ప్లాన్ ఈ హత్యకు దారి తీసింది.

Karimnagar Brother in Law Murder: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఆస్తి కోసం సొంత బావ తన బావమరిదిని హత్య చేశాడు. అయితే తాను అధికార పార్టీ కార్పొరేటర్ కు భర్త కావడమే అతను అంతటి ఘోరానికి తెగించేలా చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బావమరిది భూములు అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయలను అక్రమంగా చేజిక్కించుకోవాలని వేసిన మాస్టర్ ప్లాన్ ఈ హత్యకు దారి తీసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు కు చెందిన కొమ్ము రవీందర్ ఈ నెల రెండో తారీఖున శివారులో గల కెనాల్లో శవమై కనిపించాడు. అతని బైక్ కెనాల్ రోడ్డు పై పడి ఉండడంతో చాలామంది యాక్సిడెంట్ కారణంగా అతను అక్కడి ఫెన్సింగ్ గోడని గుద్దుకొని అందులో పడి ఉంటాడని భావించారు. అయితే మృతుడి తండ్రి మాత్రం మొదటనుండి  తన కూతురు అల్లుడు పైనే అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మృతుడి తండ్రి వెంకటయ్య  పోలీసులను ఆశ్రయించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేయాలని కోరగా పోలీసులు అలాగే చేశారు. 

పోలీసులు తమ దర్యాప్తులో విన్న సమాచారం ప్రకారం వారి ప్రధాన అనుమానితుడు అధికార పార్టీ కార్పొరేటర్ భర్త అయిన శ్రీనివాస్ యాదవ్ రామగుండం కార్పోరేషన్ లో కీలకమైన పదవిలో ఉన్న అధికార పార్టీ నేత. ఇక తమ వంతు విచారణ చేయడానికి పూర్తిస్థాయిలో సిద్ధమైన పోలీసులు అందరి మొబైల్ డాటా, ఇతర టెక్నికల్ డేటా సేకరించారు. మృతుడు ఏ ఏ ప్రాంతాల్లో తిరిగాడో వాటికి సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సైతం తెప్పించుకొని విశ్లేషణ ప్రారంభించారు. ఈ సమయంలోనే వారికీ వచ్చిన అనుమానం నిజమైంది.

అసలేం జరిగింది?
మృతుడి బావ అయిన శ్రీనివాస్ యాదవ్ రామగుండంలోని కార్పొరేషన్ లో టీఆర్ఎస్ కి సంబంధించిన నేత. అంతేకాకుండా తన భార్యని కార్పొరేషన్లో కార్పొరేటర్ గా కూడా గెలిపించుకున్నాడు. అయితే ఈ మధ్య బావమరిది అయిన రవీందర్ కి భూములు అమ్మగా వచ్చిన డబ్బు కోట్లల్లో ఉండటం గమనించాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు అయిన బావమరిదిని కనుక ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా లేపేస్తే ఆస్తి మొత్తం తన వశం అవుతుందని కుట్రకు తెర లేపాడు. దీంతో పూర్తి స్థాయిలో అతనికి సంబంధించి వివరాలు సేకరించి సూపారి గ్యాంగ్‌ ను మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. 

యాక్సిడెంట్ కారణంగా ఒక వేళ రవీందర్ చనిపోతే అతని ఆస్తి ఆటోమేటిక్ గా తన వశం అవుతుందని శ్రీనివాస్ యాదవ్ భావించి మర్డర్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు? అనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఆస్తి కోసం సొంత శ్రీనివాస్ యాదవ్ వైఖరిపట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
Mobile Phone Death: గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Embed widget