అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Job Fraud in Adilabad: ఉద్యోగాల పేరుతో మోసం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్.. ఐదుగురిపై కేసు నమోదు

Adilabad News Job Fraud | ఉద్యోగాల కోసం చూస్తున్న యువతను మోసం చేసిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసును ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జెట్టబోయిన మధు కిరణ్ (45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

నిందితుడు 2013లో "అనంత ఈ సొల్యూషన్” పేరిట కంపెనీ స్థాపించి, ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవాడు. 2023లో సుజాత ఠాకూర్, నామిని సతీష్, లావణ్యలతో కలిసి “విద్యాధాన్ ఆర్గనైజర్స్" అనే సొసైటీ రిజిస్టర్ చేసి, కేంద్ర ప్రభుత్వ విద్యాంజలి 2.0 స్కీమ్ డబ్బులు కాజేసేందుకు పథకం వేశాడు. తమకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నమ్మబలికించాడు. వారికి వివిధ ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో నకిలీ ఉద్యోగాలు వచ్చేలా చేశారు.


Job Fraud in Adilabad: ఉద్యోగాల పేరుతో మోసం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్.. ఐదుగురిపై కేసు నమోదు

A1 జట్టబోయిన మధు కిరణ్, మదాసు సుధాకర్, నిమ్మని సతీష్

ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేవాడు. ఇలా వందల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశాడు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా 240 దాదాపు మంది అభ్యర్థులను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

వివిధ పాఠశాలలు, కళాశాలలో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లతో ఉద్యోగాలు కల్పించి వారికి మూడు నెలలు వేతనం వీరే ఇచ్చేవారు. ఆ తర్వాత వేతనం అందకపోయేసరికి బాధితులు వివిధ పోలీస్ స్టేషన్ పిర్యాదు చేశారు. దీంతో వీరికి సహకరించి ఏజెంట్లుగా ఉన్న రాహుల్, కోవా విఠల్ (బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్) వరలక్ష్మిపై ఇదివరకే పలు స్టేషన్లలో కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. శనివారం జట్టబోయిన మధు కిరణ్ (45), మాదాసి సుధాకర్ (48), నమ్మని సతీష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తరువాత పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరి పాత్ర ఉన్నదనే అంశంపై విచారణ చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే ముఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అప్రమత్తతో వ్యవహరించాలని, డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. 


Job Fraud in Adilabad: ఉద్యోగాల పేరుతో మోసం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్.. ఐదుగురిపై కేసు నమోదు

నిరుద్యోగులను మోసం చేసే వారిపై, నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన 1టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ బి.గోపికృష్ణ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, 1టౌన్ ఇన్స్పెక్టర్ బి.సునీల్ కుమార్, ఎస్సెలు గోపికృష్ణ, నాగనాథ్, అశోక్ సిబ్బంది త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad blackmail gang: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్‌స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్‌స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Visakha Building Collapse: జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
జాకీలతో లేపుతుండగా కూలిన భవనం, ఒకరు మృతి - విశాఖపట్నంలో విషాదం
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
Hyderabad MMTS Stations: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు
Thalapathy Vijay Car Collection: దళపతి విజయ్ ద‌గ్గ‌ర‌ కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!
దళపతి విజయ్ ద‌గ్గ‌ర‌ కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!
US Iran War Updates: ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
Papam Prathap OTT : ఓటీటీలోకి తిరువీర్ పాపం ప్రతాప్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి తిరువీర్ పాపం ప్రతాప్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget