Hyderabad Crime News: పెద్దనాన్న లైంగిక వేధింపులు తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్, మేడ్చల్‌లో దారుణం
Medchal Malkajgiri Crime News | పెద్దనాన్న లైంగిక వేధింపులు తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీర్‌పేట సూసైడ్, మేడ్చల్‌లో దారుణం

Telangana Crime News | మేడ్చల్: బయటివారి నుంచే కాదు కుటుంబసభ్యుల నుంచి బాలికలు, మహిళలకు రక్షణ కరువైంది. లైంగిక వేధింపులు ఎవరితో చెప్పుకోవాలో తెలియక, పరిస్థితులను ఎదుర్కునే మద్ధతు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. పెదనాన్న నుంచి వస్తున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక ఓ 17 ఏళ్ల బాలిక తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం
నిజామాబాద్ జిల్లా వర్ని ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట మేడ్చల్ జిల్లాలోని కొంపల్లికి వచ్చింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు సుచిత్ర సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. ఆర్థిక అవసరాల నిమిత్తం బాలిక తండ్రి, ఆయన అన్నతో కలిసి మేడ్చల్‌లోని ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నారు. గత ఏడాది విద్యార్థిని తండ్రి ప్రమాదవశాత్తు చనిపోయాడు.
ఆ ఇంటి పెద్ద చనిపోవంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో మృతుడి సోదరుడు తరచూ బాలిక ఇంటికి వచ్చేటప్పుడు బాలికను లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక మానసిక ఒత్తిడికి లోనైంది. తన కష్టాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక, అసలే తండ్రి లేకపోవడంతో.. ఇబ్బంది పడుతున్న తల్లికి మరింత బారం కావొద్దని బావించి కఠిన నిర్ణయం తీసుకుంది. పెద్దనాన్న వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థిని తన ఇంట్లోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. కుమార్తె ఆత్మత్యపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎవరైనా వేధింపులకు గురిచేస్తే తల్లిదండ్రులకు చెప్పి, వారి సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కుటుంబం నుంచి వేధింపులు వస్తున్నా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేస్తామన్నారు. వేధింపులకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు.





















