By: ABP Desam | Updated at : 25 Jan 2022 02:35 PM (IST)
పాముకు ముద్దులు పెడుతూ ఫొటోలకు పోజులు
Hyderabad Man Has Bitten Venomous Snake: మనం చేసే పని నలుగురికి నచ్చకపోయినా సరే కానీ ఎవరి ప్రాణాల మీదకి తెచ్చేది అయి ఉండొద్దని పెద్దలు చెబుతుంటారు. తాగిన మత్తులోగానీ, లేక ఎక్స్‌పర్ట్‌ను అంటూ చేయకూడదని పనుల జోలికి సైతం వెళ్లడం ప్రాణాల మీదకి తెస్తుంది. సరదా కోసం ఓ వ్యక్తి చేసిన పని విషమంగా మారింది. చివరికి ఆసుపత్రిలో చేరి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పాముతో చెలగాటం ఆడిన వ్యక్తి వివరాలిలా ఉన్నాయి..
మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్(30) కొంతకాలం కిందట హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గాజులరామారం పరిధిలోని కట్టమైసమ్మబస్తీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అతడు రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. పాములు పట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఆదివారం సాయంత్రం జనావాసాల్లోకి వచ్చిన ఓ పామును ఆకాష్ పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా పాములో చెలగాటం ఆడాడు. పాముకు ముద్దులు పెడుతూ ఈ తతంగాన్ని సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నాడు.
Koo Appసరదా కోసం ఓ వ్యక్తి చేసిన పని విషమంగా మారింది. చివరికి ఆసుపత్రిలో చేరి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆకాష్ ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గాజులరామారం కట్టమైసమ్మబస్తీలో ఉంటున్నాడు. పాముకు ముద్దులు పెడుతూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. #Hyderabad #Snakeswamy🐍 #Snakes #ViralNews https://telugu.abplive.com/crime/hyderabad-man-has-bitten-poisonous-snake-while-taking-selfies-in-gajularamaram-hyderabad-19791 - Shankar (@guest_QJG52) 25 Jan 2022
కొద్దిసేపు పాముతో ఆటల తరువాత విష సర్పాన్ని వదిలిపెట్టేశాడు. కానీ రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పాము కాటు వేయడం వల్ల అతడు అస్వస్థతకు గురయ్యాడని, . పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడి శరీరం, ఉదరం నుంచి విషాన్ని తొలగించిన వైద్యులు అతడ్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విష సర్పాలతో ఇలాంటి చేష్టలు చేయకూడదని సూచించారు.
Also Read: Nellore Police: నెల్లూరు పోలీసుల మర్యాదలే వేరబ్బా.. నిజమేనా అని డౌటా..! అయితే ఇది చదవండి
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Tamilnadu Murder: దుప్పటి కప్పుకున్న భార్యపై భర్త కత్తి పోట్లు - ఆమె ముఖం చూసి షాక్!
Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
Bhadrachalam ఎక్సైజ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్‌తో చివరకు ఊహించని ట్విస్ట్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?