Hyderabad Crime: అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన అత్త.. సాయం చేసిన కూతురు
కూతురిని అల్లుడు బాగా వేధింపులకు గురి చేస్తున్నందున తట్టుకోలేని అత్త అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించేసింది. అందుకోసం కుమార్తె కూడా సహకరించింది.
ఓ అత్త తన అల్లుడికి నిప్పంటించి ఏకంగా కాల్చి చంపేసింది. విస్మయం కలిగించే ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూతురిని అల్లుడు బాగా వేధింపులకు గురి చేస్తున్నందున తట్టుకోలేని అత్త అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించేసింది. అందుకోసం కుమార్తె కూడా సహకరించింది. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కూతురిని వేధిస్తున్నందుకు అల్లుడిపై కిరోసిన్ పోసి ఓ అత్త నిప్పంటించింది. ఆ నేరం చేసేందుకు కూతురు కూడా సహకరించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో యువకుడిని స్థానికులు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో యువకుడు శనివారం రాత్రి మృతిచెందాడు. అడ్డగుట్ట పొచమ్మ దేవాలయం వద్ద నివసించే దండుగళ్ల నాని అనే 28 ఏళ్ల వ్యక్తి కారు డ్రైవర్. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎల్‌ఎన్‌ఎస్ నగర్‌లో ఉంటున్న అనిత అలియాస్ సోని అనే 26 ఏళ్ల యువతితో 2015లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కూతురు కూడా ఉంది.
అయితే, నాని మందు తాగేందుకు బాగా అలవాటు పడ్డాడు. రోజూ తాగి ఇంటికి వచ్చి ఆ మైకంలో భార్యను ఇబ్బందులకు గురి చేసేవాడు. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో భార్య కూడా అతనితో తరచుగా గొడవలు పడేది. దీంతో తొమ్మిది నెలల క్రితమే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి భర్త దగ్గరికి వెళ్లకుండా పుట్టింటిలో కూతురితో పాటు తల్లితోనే ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 13న తన కూతుర్ని చూసేందుకు నాని ఆమె వద్దకు వచ్చాడు. ఆ సమయంలో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లుడి మాటలకు ఆగ్రహం చెందిన అత్త తిరుపతమ్మ అలియాస్ పార్వతమ్మ అనే 45 ఏళ్ల మహిళ.. కుమార్తెతో కలిసి అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించేసింది. దీంతో స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి అతడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు
Also Read: Suryapet: మహిళ బట్టలిప్పేసి కళ్లలో కారం కొట్టి.. కర్రలతో కొడుతూ నగ్నంగా ఊరేగింపు