By: ABP Desam | Updated at : 30 Aug 2021 07:13 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా స్థిరత్వమే కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనూ గత వారం రోజులుగా ఇదే స్థితి కొనసాగుతోంది. నేడు (ఆగస్టు 30న) తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఆగస్టు 30న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.54 కాగా.. డీజిల్ ధర రూ.96.99 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.01 పైసలు తగ్గి రూ.105.71గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.01 పైసలు తగ్గి రూ.97.14 వద్ద ఉంది.
ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.06 కాగా.. డీజిల్ ధర రూ.96.53 గా స్థిరంగానే ఉంటూ వస్తోంది. వరంగల్‌లో మూడు రోజులుగా ఇవే ధరలు నిలకడగా ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.16 పైసలు పెరిగింది. తాజాగా ధర రూ.107.17 గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.15 పైసలు పెరిగి.. ప్రస్తుత ధర రూ.98.50గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో కాస్త ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.14 పైసలు పెరిగి.. ప్రస్తుతం రూ.107.77 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.15 పైసలు పెరిగి రూ.98.71కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.49గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.63 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.58 పైసలు తగ్గి రూ.97.48గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉండగా.. తాజాగా స్వల్పంగా ఉంటున్నాయి.
తిరుపతిలో భారీగా పెరిగిన ధర
తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర రూ.1.63 తగ్గి ప్రస్తుతం రూ.107.94 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా తాజాగా తగ్గింది. ఇక డీజిల్ ధర రూ.1.52 పెరిగి రూ.98.82గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 30 నాటి ధరల ప్రకారం 68.66 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: Gold-Silver Price: మీ నగరంలో పసిడి, వెండి రేట్లు ఇలా.. స్వల్పంగా పెరిగిన బంగారం
MSSC vs SSY: ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ Vs సుకన్య సమృద్ధి యోజన - ఏది బెటర్ ఆప్షన్?
Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్ కట్టాలో ముందు తెలుసుకోండి
Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు
SIM Card Rules: కొత్త సిమ్ తీసుకోవాలంటే కొత్త రూల్స్, ఇకపై ట్రిక్స్ పని చేయవు
Tax Exemption: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>