Crime : పెళ్లి చేసుకుంది ఫ్రెండ్స్‌తో సంసారం చేయించడానికా ? గుజరాత్‌లో ఈ మగాడి నిర్వాకం ఎలా ఉందంటే ?
Gujarat News : కొంత మంది డబ్బుల కోసమే అమాయకుల్ని పెళ్లి చేసుకుని హింసిస్తూంటారు. ఇలాంటి మృగాళ్లు అన్నిచోట్లా ఉంటారు. అలాంటి వ్యక్తి గుజరాత్ లో కూడా ఉన్నాడు.
Husband Refuses Physical Intimacy After Marriage Wife Shocked by Revealed Truth : అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన ప్రోఫైల్ల పెట్టి.. సెకండ్ మ్యారేజీ అమ్మాయి అయినా పర్వాలేదు.. జీవితం ఇవ్వడానికి రెడీ అని ప్రకటించేశాడు. ఇతనేదో అభ్యుదయవాదిలా ఉన్నాడని హర్యానాకు చెందిన ఓ డైవర్సీ మహిళ కుటుంబం కాంటాక్ట్ అయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళ మొదటి పెళ్లి వర్కవుట్ కాలేదు. అందుకే అహ్మదాబాద్ యువకుడిని చూసి మాట్లాడి ఓకే చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. కానీ మాయ అంతా మాటల్లోనే ఉందని ఆ పెళ్లి కూతురికి ఫస్ట్ నైట్ రోజునే తెలిసి వచ్చింది.
ఫస్ట్ నైట్ రోజు భార్యను టచ్ చేయడానికి ఇష్టపడలేదు భర్త. తనక ప్రైవేటు పార్టుల్లో ఇన్ ఫెక్షన్ వచ్చిందని చెప్పి తప్పించుకున్నాడు. తర్వాత హనీమూన్ కు అని తీసకెళ్లాడు.. అక్కడా అదే పరిస్థితి. ఇలా చేస్తున్నాడని అత్త, మామల దృష్టికి ఆమె తీసుకెళ్లింది. అయితే వారు తమ కుమారుడికే మద్దతు పలికారు. వాడంతే అని.. కావాలంటే అతని స్నేహితులతో పరిచయాలు పెంచుకుని సంబంధాలు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఈ సలహా విని ఆ పెళ్లి కూతురుకు మైండ్ బ్లాంక్ అయింది. అసలు ఈ ఫ్యామిలీ చరిత్ర ఏమిటని మొత్తం బయటకు తీసింది.
లంచం కోసం సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఎంఈవో తనిఖీలు-డోర్ కొట్టిన ఏసీబీ అధికారులు
అప్పటికే ఆ వ్యక్తికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. వారిద్దరినీ డబ్బుల కోసం వేధించడమే కాకుండా.. తీవ్రంగా హింసించారని తేలింది. పైగా సంసారానికి పనికి రాడని.. ఆ వ్యక్తి పురుషులతోనే సన్నిహితంగా ఉంటాడని తేలింది. ఈ వివరాలన్నీ తన తల్లిదండ్రులకు తెలిపింది. అప్పట్నుంచి ఈ యువతిని కూడా ఆ భర్త ఆమె తల్లిదండ్రులు వేధించడం ప్రారంభించారు. చివరికి సహనం నశించి ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మోసం చేశారని.. కట్నం కోసం వేధిస్తున్నాడని బీఎండబ్ల్యూ కారు కావాలని వేధిస్తున్నాడని కేసు పెట్టింది.