అన్వేషించండి

Guntur Crime : గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు- కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ

Guntur Crime : గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి 50 గొర్రెల మందను చోరీ చేశారు.

Guntur Crime : గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో దొంగలు రెచ్చి పోయారు. గొర్రెల కాపరిని టార్గెట్ చేసిన దొంగలు.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొర్రెలను దొంగిలించారు. మరుసటి‌ రోజు బంధువులు వచ్చేవరకు గొర్రెల కాపరి మత్తులోనే ఉన్నాడు. చోరీ చేసిన జీవాల‌‌ విలువ సుమారు ఆరు లక్షల‌ వరకు ఉండటంతో బాధితుడు లబోదిబో అంటున్నాడు. పోలీసులు మాత్రం చోరీ జరిగిన ప్రాంతం ఏ జిల్లాలోకి వస్తుందా అనే పనిలో నిమగ్నమై ఉండటం కొసమెరుపు. 

అసలేం జరిగింది? 

 మున్నంగి గ్రామానికి చెందిన కృష్ణరావు నాలుగు ఏళ్ల నుంచి గొర్రెలు కాపరిగా జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే గొర్రెలు మేపటానికి కృష్ణానది లంకల్లోకి వెళ్లాడు. గొర్రెలు కాస్తున్న క్రమంలో గుర్తుతెలియని నాలుగు దుండగులు వెనక నుంచి వచ్చి కృష్ణారావు ముఖానికి ముసుగువేసి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత తాళ్లు, టేప్ తో కట్టేశారు.  అక్కడ ఉన్న  50 గొర్రెలను తరలించుకుపోయారు.  కృష్ణారావుకు మత్తు ఇంజక్షన్ ఇవ్వటంతో మత్తులోకి జారుకున్నాడు. చీకటి పడ్డా కృష్ణారావు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు ఆందోళన చెందారు. స్థానికులతో కలిసి‌ వెతకగా స్పృహ కోల్పోయిన స్థితిలో కృష్ణారావు వారికి కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.  అనంతరం ఈ ఘనటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గొర్రెలు చోరీ జరిగిన ప్రదేశం గుంటూరు జిల్లా కింద వస్తుందా లేక కృష్ణా జిల్లా కిందికి వస్తుందా అని మీనమేషాలు లెక్కిస్తున్నారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 బాధితులు మాట్లాడుతూ 

గత నాలుగు సంవత్సరాల నుంచి కృష్ణా నది లంకల్లోనే గొర్రెల కాస్తూ జీవనం సాగిస్తున్నానని బాధితుడు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా గొర్రెలతో అదే చోటుకి తీసుకొని వెళ్లగా గొర్రెలు కాస్తున్న సమయంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వెనక నుంచి వచ్చి ముసుగు వేసి ఇంజక్షన్ చేశారని, అనంతరం తాళ్లు, టేప్ తో తనను కట్టేసి గొర్రెలను తీసుకొని పారిపోయారని తెలిపారు. అనంతరం తమ బంధువులు వచ్చి చూసేదాకా తనకు స్పృహ లేదని తెలిపారు.  కొల్లిపర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలియజేశారు.  

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చోరీలు   

క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి చేసిన వ్యక్తి అప్పులు తీర్చేందుకు దొంగతనాలు మొదలుపెట్టాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినప్పటికీ బెట్టింగ్స్ లో నష్టపోయి అప్పులు చేయడంతో, బాకీలు తీర్చేందుకు చోరీలకు పాల్పడుతున్న యువకుడ్ని అరెస్టు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం పాతపట్నం ప్రాంతానికి చెందిన సావణ మనోజ్ కుమార్ ఎంబీఏ పూర్తి చేసి ప్రగతి నగర్ లేక్ యు కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడి దొరికిన చోటల్లా అప్పులు చేసేవాడు. ఐదు నుంచి 10 శాతం వడ్డీలకు అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ లో పెట్టి నష్టపోయాడు. ఆ అప్పులను తీర్చేందుకు సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. 

గత నెల 31వ తేదీన మధ్యాహ్నం ఒకటి గంట సమయంలో నిజాంపేట్ శ్రీనివాస కాలనీ శ్రీ బాలాజీ రెసిడెన్సి లోని వృద్ధురాలు స్వర్ణలత సాయిబాబా ఆలయానికి వెళ్లింది. పూజ అనంతరం ఇంటికి వస్తుండగా దారిలో ఇల్లు అద్దెకు కావాలని అడుగుతూ వెంబడించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనోజ్ కుమార్.. ఇంటి వద్ద లిఫ్ట్ దగ్గర గొలుసు తెంచుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శశిగూడ వద్ద అదుపులోకి తీసుకొని మియాపూర్ లో దొంగిలించిన స్కూటీ, రెండున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని  స్టేషన్ కు తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget