Crime News: ఫోన్ కాల్ లో పరిచయం.. వరంగల్ నుంచి కృష్ణా జిల్లాకు రమ్మన్నాడు.. వచ్చాక.. అర్ధరాత్రి పూట..
ఇంటి పక్క వారినే సరిగా నమ్మే్ందుకు ఆలోచించాల్సిన రోజులివి. అలాంటిది ఓ మహిళ ఫోన్ కాల్ లో పరిచయమైన వ్యక్తిని నమ్మింది. చివరకు..
ఈ కాలంలో ఎవరిని.. నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. బయటకు కనిపించినంత.. లోపల ఆలోచన విధానం ఉండదు అనే చెప్పేందుకు చాలా ఉదాహరణాలున్నాయి. వెంట తీసుకెళ్లి ఏ క్షణం ఏం చేస్తారో తెలియదు. నమ్మి వెళ్తే.. అంతే సంగతులు. ఓ మహిళ ఫోన్ కాల్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో సంబంధం పెట్టుకుంది. కలిసేందుకు మళ్లీ ఓసారి రమ్మన్నాక.. వెళ్ళింది.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామానికి చెందిన ఏసురాజు ఒంటరిగా జీవిస్తున్నాడు. ఒక్కడే ఉంటూ.. మానసికంగా కూడా కాస్త అటుఇటుగానే ఉన్నాడు. అయితే అతడికి ఫోన్ కాల్ లో వరంగల్ కు చెందిన కృష్ణవేణి అనే మహిళ పరిచయమైంది. అయితే వీళ్లు కొన్ని రోజులు మాట్లాడుకున్నాక.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఏసురాజు వరంగల్ కు వస్తే.. మరికొన్ని సార్లు కృష్ణవేణి.. కృష్ణా జిల్లాకు వెళ్లింది. వీళ్లిద్దరి మధ్య ఇలా జరుగుతున్న క్రమంలో.. ఆదివారం రోజున.. కృష్ణవేణికి ఏసురాజు ఫోన్ చేశాడు. కలుద్దాం ఇంటికి రామ్మన్నాడు. ఎప్పటిలాగానే సుబ్బాయి గూడెం వెళ్లింది కృష్ణవేణి.
చాలా రోజుల తర్వాత వచ్చిన ప్రేయసిని తీసుకెళ్లాడు ఏసురాజు. అయితే ఆదివారం అర్ధరాత్రి వారిద్దరి నడుమ ఘర్షణ మెుదలైంది. ఈ క్రమంలో ఏసు రాజు బ్లేడ్ తో కృష్ణవేణి గొంతుపై గాయం చేశాడు. ఆపై.. తాను కూడా చేతిపై గాయం చేసుకున్నాడు. కాస్త గొడవ గొడవై.. బయటకు చప్పుడు రావడంతో స్థానికులకు విషయం తెలిసింది. వెంటనే వారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని.. 108 వాహనంలో వారిద్దరినీ పెనుంచిప్రోలులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయలు చిన్నవే కావడంతో ప్రస్తుతం ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ ఘటనపై ప్రియురాలు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతానికి పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Also Read: Kamareddy Crime: భర్త వేధింపులు భరించలేక భార్య దారుణం... భర్త మెడకు చున్నీ బిగించి హత్య...!
Also Read: Mahabubabad: కన్న బిడ్డల్ని బావిలోకి నెట్టేసిన సీఆర్పీఎఫ్ జవాను! వెంటనే పరారీ.. కారణం ఏంటంటే..
Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..