News
News
X

Chittor Rape: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం

ఓ వృద్ధురాలిని అత్యాచారం చేయడం సహా ఆమె మనుమరాలైన బాలికను బాలుడు రేప్ చేసేందుకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది.

FOLLOW US: 
 
అత్యాచార ఘటనలు సంచలనంగా మారి సర్వత్రా నిరసనలు హోరెత్తుతున్న తరుణంలో కూడా అలాంటి ఘటనలు ఆగడం లేదు. పసి పిల్లల నుంచి పండు ముసలివారి వరకూ అత్యాచారాలు ఎదుర్కొంటున్న మహిళలు ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటన మరవక ముందే చిత్తూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పలమనేరులో 80 ఏళ్ల పెద్దావిడపై 16 బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. కదల్లేని ఆమెపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆవిడకు అన్నంత తెచ్చేందుకు వచ్చిన చిన్న బాలికపై కూడా అత్యాచారానికి ఆ బాలుడు యత్నించాడు. పూర్తి వివరాలివీ..

ఓ వృద్ధురాలిని అత్యాచారం చేయడం సహా ఆమె మనుమరాలైన బాలికను బాలుడు రేప్ చేసేందుకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరు పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో 80 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె దగ్గరి బంధువులు ఇక్కడికి సమీపంలోనే ఉంటున్నారు. అదే కాలనీలో జులాయిగా తిరిగే 16 ఏళ్ల బాలుడు ఏదో పనిపై వృద్ధురాలి దగ్గరికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం వృద్ధురాలు మంచంపై కదలలేని స్థితిలో ఉండగా గమనించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గంట తరువాత వృద్ధురాలి మనుమరాలైన ఆరేళ్ల బాలిక ఆమె కోసం కోసం అన్నం తీసుకుని ఆ ఇంటికి వచ్చింది. 

Also Read: దసరాకి ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు.. ప్రత్యేక వడ్డన, ప్రత్యేక సర్వీసులు అంటున్న ప్రభుత్వాలు

దీంతో ఆ బాలుడు బాలికపై కూడా అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అమ్మాయి భయపడిపోయి కేకలు వేయడంతో ఆందోళన పడ్డ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరో గ్రామంలో పనులు చూసుకుని ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక జరిగిన ఘటన మొత్తం వివరించింది. సమీప బంధువైన వృద్ధురాలు కూడా విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృద్ధురాలు, బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

News Reels

Also Read: అసెంబ్లీలో కేసీఆర్ కు 'ఆర్ఆర్ఆర్' సినిమా చూపిస్తారు.. బీజేపీ గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని బండి సవాల్..

Also Read:  రసవత్తరంగా హుజూరాబాద్ ఉపఎన్నిక... అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థి ఎవరంటే..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Oct 2021 10:21 AM (IST) Tags: Chittor Rape Old woman Rape Boy rapes Old Woman Palamaner Rape AP Rape incident

సంబంధిత కథనాలు

Nellore Girl Kidnap: నెల్లూరులో బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలో కిడ్నాపర్ అరెస్ట్

Nellore Girl Kidnap: నెల్లూరులో బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలో కిడ్నాపర్ అరెస్ట్

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Hyderabad Crime News: అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు - 17 మందిని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

Hyderabad Crime News: అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు - 17 మందిని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

టాప్ స్టోరీస్

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

Ind vs Bang, 2nd ODI: నేడు భారత్- బంగ్లా రెండో వన్డే- సిరీస్ ఆశలు నిలిచేనా!

Ind vs Bang, 2nd ODI: నేడు భారత్- బంగ్లా రెండో వన్డే- సిరీస్ ఆశలు నిలిచేనా!

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ 9 నుంచి 11 వరకు ఆ రూట్లలో వెళ్లొద్దు

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ 9 నుంచి 11 వరకు ఆ రూట్లలో వెళ్లొద్దు