అన్వేషించండి

Chittoor Crime : పొలాల వద్ద ఇళ్లే టార్గెట్, చోరీలు చేసి మారుమూల గ్రామాల్లో మకాం!

Chittoor Crime : అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ దొంగను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై ఆంధ్ర, తెలంగాణ,తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో 40కి పైగా కేసులు ఉన్నాయి.

Chittoor Crime : మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.  ఒంటరి ప్రదేశాల్లో‌, పొలాల వద్ద ఇళ్లే  టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడమే అతని హాబీ. దొంగతనాలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎవరికి అనుమానం రాకుండా మారుమూల గ్రామాల్లో తలదాచుకుంటాడు. దోచుకున్న నగదు ఖాళీ కాగానే తిరిగి దొంగతనాలకు పాల్పడి మరో మారుమూల గ్రామానికి వెళ్లేవాడు. ఇలా ఏళ్ల తరబడి నాలుగు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని‌ తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.  అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా, భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు.  

పోలీసుల వివరాలు ఇలా 

చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. జిల్లాలో ఇటీవల పంజాణి పోలీసు స్టేషన్ పరిధిలో పొలాల దగ్గర ఉన్న ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును ప్రతిష్టత్మకంగా తీసుకొన్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రెండు నెలల నుంచి ఈ కేసును దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించి ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా పలమనేరు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో పంజాణి మండలం పలమనేరు– మదనపల్లి రోడ్డులోని కళ్లుపల్లి క్రాస్ వద్ద  నిందితుడుని అరెస్టు చేశారు. 

Chittoor Crime : పొలాల వద్ద ఇళ్లే టార్గెట్, చోరీలు చేసి మారుమూల గ్రామాల్లో మకాం!

ఒంటరి ఇల్లే టార్గెట్ 

ఈ కేసులో నిందితుడు తమిళనాడు కళ్ళకురుచి జిల్లా తిమ్మలై గ్రామానికి చెందిన K.మురుగన్ అలియాస్‌ కరుపు మురుగన్ గా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి నిందితుడి నుంచి సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ½ kg ల వెండి, మొత్తం రూ.11,50,000 విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత రెండు సంవత్సరాల నుంచి దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని పొలాల వద్ద ఒంటరి ఇండ్లు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవాడు. భారీ మొత్తాలను దోచుకొని జల్సా చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్నట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.  నిందితుడు నేరం చేసిన ప్రతీసారి ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో దాక్కునేవాడు. తన వద్ద డబ్బులు అయిపోయాక మళ్లీ నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. ఇతనిపై సుమారు నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 40 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అయితే నిందితుడు చిత్తూరు జిల్లాలో రాళ్ళబుదుగురు, బంగారుపాళ్యం, జీడి నెల్లూరు, పలమనేరు, కుప్పం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసులో‌ నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.  ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని  చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.  నిందితుడుని అరెస్టు చేసిన పోలీసులకు ఎస్పీ అభినందనలు తెలిపారు. చిత్తూరులో దొంగతనాలపై నిఘా పెట్టామన్నారు. బోర్డర్ రాష్ట్రాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి పట్టుకునే డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. 

Chittoor Crime : పొలాల వద్ద ఇళ్లే టార్గెట్, చోరీలు చేసి మారుమూల గ్రామాల్లో మకాం!

(నిందితుడు మురుగన్)

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget