అన్వేషించండి

Restaurant dating scams: ఆన్‌లైన్ మోసాలే కాదు డేటింగ్ స్కాములు కూడా - ఇది మామూలు ట్రాప్ కాదు !

Dating scams:ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ స్కామ్‌ల నుంచి తప్పించుకోవడమే కష్టమవుతోంది. ఇప్పుడు కొత్తగా డేటింగ్ స్కాములు వచ్చేశాయి.

Restaurant dating scams work in Metros:  మోసాల బారిన పడకుండా తప్పించుకోవడం ఇప్పుడు సామాన్యులకే కాదు చదువుకున్న వారికీ అసాధ్యంగా మారుతోంది. ఓ వైపు ఆన్ లైన్ మోసాల బారి నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతూంటే.. ఇప్పుడు  హృదయాలను  గాలంగా వేసి జేబులు ఖాళీ చేసే సరికొత్త  డేటింగ్ స్కామ్ ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలను వణికిస్తోంది. ఒక అందమైన అమ్మాయి, ఒక క్యాజువల్ డేట్, ఒక ఖరీదైన డిన్నర్.. చివరికి వేల రూపాయల బిల్లుతో ముగిసే ఈ నాటకీయ మోసం ఎలా సాగుతుందో మీరే చదవండి.             

ఈ స్కామ్ సాధారణంగా 'టిండర్' లేదా 'బంబుల్' వంటి డేటింగ్ యాప్‌లలో మొదలవుతుంది. అవతలి వైపు నుండి ఒక అందమైన యువతి మీకు రిక్వెస్ట్ పంపుతుంది. కొద్దిసేపు ముచ్చటించాక, ఆమె మీపై అమితమైన ఆసక్తి చూపిస్తూ..  ఈరోజే ఎక్కడైనా కలుద్దామా? అని అడుగుతుంది. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. ఆమె ముందే ఒక రెస్టారెంట్‌ను ఫిక్స్ చేస్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక, ఆ రెస్టారెంట్ చాలా సాధారణంగా అనిపించినా, అక్కడ ఆమె ఆర్డర్ చేసే ఐటమ్స్ ధరలు మాత్రం చుక్కలను తాకుతాయి.                

మీరు మాటల్లో  మునిగి ఉండగా, ఆమె గడగడా ఖరీదైన వైన్, వెరైటీ స్టార్టర్స్, హుక్కా వంటివి ఆర్డర్ చేసేస్తుంది. చిత్రమేమిటంటే, ఆ రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఈ స్కామ్‌లో భాగస్వామి అయి ఉంటుంది. మీరు వెళ్ళిన రెస్టారెంట్‌లో మెనూ కార్డుపై ధరలు ఉండవు లేదా వారు చెప్పే ధరలు వేరుగా ఉంటాయి. డిన్నర్ ముగిశాక, మీ చేతిలో పెట్టే బిల్లు రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు ఉంటుంది. మీరు ప్రశ్నిస్తే, వెంటనే బౌన్సర్లు ప్రత్యక్షమై మిమ్మల్ని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తారు.            

ఈ స్కామ్‌లో మరో ట్విస్ట్ ఏంటంటే, బిల్లు కట్టే సమయానికి ఆ యువతి  ఫోన్ కాల్ వస్తోంది అని లేదా  వాష్‌రూమ్‌కి వెళ్తున్నా  అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంటుంది. చివరికి మీరు ఒంటరిగా ఆ భారీ బిల్లుతో, భయపెట్టే బౌన్సర్ల మధ్య చిక్కుకుపోతారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా, డేటింగ్‌కు వెళ్ళాను అని చెప్పుకోవడానికి మొహమాటపడి చాలామంది బాధితులు మౌనంగా ఆ మొత్తాన్ని చెల్లించి వచ్చేస్తున్నారు. ఇదే మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది.       

ముంబైలోని అంధేరి, బెంగళూరులోని కోరమంగళ వంటి ప్రాంతాల్లో ఇలాంటి కేసులు ఇటీవల అధికంగా నమోదవుతున్నాయి. అందుకే, ఆన్‌లైన్ డేటింగ్‌లో తెలియని వ్యక్తులు తాము చెప్పిన చోటకే రమ్మని పట్టుబడితే అది ప్రమాద సంకేతం అని గుర్తించాలి. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలను, మీకు తెలిసిన ప్రదేశాలను మాత్రమే ఎంచుకోవడం శ్రేయస్కరం. గుర్తుంచుకోండి, ఆ అరగంట ముచ్చట మీ జేబుకు రూ. 20,000 చిల్లు పెట్టవచ్చు!            

టాప్ హెడ్ లైన్స్

Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget